/rtv/media/media_files/2025/07/05/tenth-class-2025-07-05-21-08-57.jpg)
నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. కొండాపురం మండలం, తూర్ప ఎర్రబల్లి గ్రామంలో పదవ తరగతి విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. గుసిరాజు వంశీ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికపై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరూ జడ్పీహెచ్ హైస్కూల్‌లో పదవ తరగతి చదువుతున్నారు. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. పదవ తరగతి ఫలితాలు తరువాత వంశీ వింజమూరు వివేకానంద కళాశాలలో చేరగా, బాలిక ఇంటి వద్దనే ఉంది. అయితే గత నాలుగు రోజులుగా బాలిక కందుకూరులోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది. అక్కడ ఆమెకు కడుపు నొప్పి రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించగా, బాలిక గర్భవతి అని తేలింది. దీంతో విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
Also read : Sekhar Kammula : స్టార్ హీరోయిన్తో శేఖర్ కమ్ముల పవర్ ఫుల్ మూవీ!
వంశీపై పోక్సో చట్టం
బాలికను మెరుగైన చికిత్స కోసం ఒంగోలులోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం, బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కొండాపురం పోలీసులు గుసిరాజు వంశీని అదుపులోకి తీసుకున్నారు. వంశీపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన తూర్ప ఎర్రబల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మైనర్ బాలికపై జరిగిన ఈ దాడి, యువతలో పెరుగుతున్న నేర ప్రవృత్తి, లైంగిక వేధింపుల పట్ల సమాజంలో అవగాహన లోపం వంటి అంశాలను మరోసారి తెరపైకి తెచ్చింది. పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Also Read : విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్ రికార్డులను బద్దలు కొట్టిన కెప్టెన్ గిల్