పాఠశాలలో ర్యాగింగ్.. విద్యార్థి ఆత్మహత్యాయత్నం

ర్యాగింగ్ బాధ తట్టుకోలేక ఆరో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా గిరిజన పాఠశాలలో చోటుచేసుకుంది. వార్డెన్‌కి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని విద్యార్థి ఎలర్జీ మందు తాగాడు. వెంటనే విద్యార్థిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు.

New Update
Maharashtra crime

కాలేజీలో ర్యాగింగ్‌లు ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నాయి. ర్యాగింగ్ బాధను తట్టుకోలేక కొందరు కాలేజీ మానేయడం, చనిపోవడం వంటివి చేస్తుంటారు. ఇలానే ఓ విద్యార్థి ఆత్మహత్య ఘటన ఇటీవల చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల ఉంది.

ఇది కూడా చూడండి:  Hyderabad: నేడు నగరంలో భారీ ఎయిర్‌ షో..ఈ  ఏరియాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు!

ర్యాగింగ్ బాధ తట్టుకోలేక..

ఇక్కడ చదువుతున్న పదో తరగతి విద్యార్థులు జూనియర్స్‌ను ర్యాగింగ్ చేశారు. ఈ క్రమంలో ఆరో తరగతికి చెందిన ఓ విద్యార్థిని ర్యాగింగ్ చేయగా.. ఆ బాధను తట్టుకోలేక ఎలర్జీ నివారణకు వాడే మందు తాగాడు. ఈ విషయాన్ని గమనించిన విద్యార్థులు టీచర్‌కు చెప్పడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ విద్యార్థికి చికిత్స అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:Ap Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..నేడు ఈ జిల్లాల్లో వానలు!

ఆశ్రమంలో ర్యాగింగ్ బాధ తట్టుకోలేక విద్యార్థి ఎన్నోసార్లు వార్డెన్‌కు కూడా చెప్పాడట. అయిన వార్డెన్ కనీసం పట్టించుకోలేదు. కేవలం వార్డెన్ నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడని అంటున్నారు. ఈ ఘటనపై పూర్తిగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆ్రమ ప్రిన్సిపల్ తెలిపారు. 

ఇది కూడా చూడండి: వందే భారత్ స్లీపర్ రైళ్లకు ముహుర్తం ఫిక్స్‌..ఈ మార్గంలోనే తొలి రైలు!

ఇదిలా ఉండగా ఇటీవల కడప జిల్లాలో ఓ దారుణం చోటుచేసుకుంది. ఓ యువతి ప్రేమించలేదని యువకుడు కత్తితో పొడిచాడు. కొత్తపల్లిలో షర్మిల అనే అమ్మాయిని కులయప్ప అనే యువకుడు ప్రేమించాడు. అయితే షర్మిల ఆ అబ్బాయిని ప్రేమించలేదు. దీంతో కులయప్ప రెచ్చిపోయాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటరిగా ఉన్న షర్మిల పై కులయప్ప కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువతి కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వారు అక్కడకు చేరుకున్నారు.  దీంతో వారిని చూసి కులయప్ప పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న షర్మిలను చికిత్స కోసం చుట్టుపక్కల వారు, బంధువులు పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇది కూడా చూడండి: Fire Accident: తిరుమలలో రన్నింగ్ కారులో మంటలు..భయంతో భక్తులు పరుగులు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు