అతివేగంతో ప్రయాణించడం వల్ల పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లిలో నలుగురు అక్కడిక్కడే మరణించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలానికి చెందిన సురేశ్, వనిత, యోగులు, వెంకటేశ్వర్లు కొత్త కారు పూజ చేయడానికి తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లారు. ఇది కూడా చూడండి: Hyderabad: నేడు నగరంలో భారీ ఎయిర్ షో..ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు! దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా.. దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై చెట్టును కారు ఢీకొట్టింది. అతివేగంతో ప్రయాణించడం వల్ల స్పాట్ నలుగురు మరణించగా.. మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇది కూడా చూడండి:Ap Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..నేడు ఈ జిల్లాల్లో వానలు! ఇదిలా ఉండగా ఇటీవల యాదాద్రి జిల్లాలో కూడా ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్ గ్రామంలో కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. అందులో ఉన్న ఐదుగురు చనిపోయారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే వారిని స్థానికులు చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. హైదరాబాద్ నుంచి పోచంపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇది కూడా చూడండి: వందే భారత్ స్లీపర్ రైళ్లకు ముహుర్తం ఫిక్స్..ఈ మార్గంలోనే తొలి రైలు! మృతులు హైదరాబాద్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వంశీ గౌడ్ దినేష్, హర్ష, బాలు వినయ్ లు ఈ యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పొయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. యాక్సిడెంట్ కు గల కారణాలు తెలుసుకుంటున్నారు. మృతదేహాలను చెరువులోనుంచి బయటకు తీశారు. పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కు పంపించారు. ఇది కూడా చూడండి: Fire Accident: తిరుమలలో రన్నింగ్ కారులో మంటలు..భయంతో భక్తులు పరుగులు