తెలంగాణ-ఛత్తీస్‌గడ్ సరిహద్దులోని పోలీసు బేస్ క్యాంప్‌పై మావోయిస్టులు మరోసారి దాడి చేశారు. బీజాపూర్ జిల్లాలోని జీడిపల్లి-2 పోలీసు బేస్ క్యాంప్‌పై రాకెట్ లాంఛర్లతో దాడి చేశారు. ఇద్దరి మధ్య కాల్పులు జరగ్గా ఓ జవాను తీవ్రంగా గాయాల పాలయ్యాడు. రెండు రోజుల కిందటే ఈ బేస్ క్యాంపుపై మావోయిస్టులు దాడి చేశారు.
ఇది కూడా చూడండి: Hyderabad: నేడు నగరంలో భారీ ఎయిర్ షో..ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు!
రెండు రోజుల కిందటే..
ఇదిలా ఉండగా రెండు రోజుల కిందటే ఛత్తీస్‌గడ్ - తెలంగాణ సరిహద్దుల్లోని జీడిపల్లి బేస్ క్యాంప్‌పై మావోయిస్టులు దాడి చేశారు. బీజాపూర్ భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య రాత్రి నుంచి భీకర ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. జీడిపల్లి-2 క్యాంపును గత రెండు రోజుల కిందటే ప్రారంభించారు. బేస్ క్యాంప్ ఔటర్ కార్డన్‌లో భద్రత కొరకు జవాన్లను ఉంచారు.
ఇది కూడా చూడండి:Ap Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..నేడు ఈ జిల్లాల్లో వానలు!
వారిపై మావోయిస్టులు కాల్పులు జరపగా జవాన్లు దాడులను తిప్పికొట్టారు. గంట పాటు జరిగిన ఈ భీకర కాల్పుల్లో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వారిలో ఒకరి పరిస్థితి కాస్త విషమంగానే ఉంది. అయితే జవాన్లపై కాల్పులు జరిపిన మావోయిస్టుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇది కూడా చూడండి: వందే భారత్ స్లీపర్ రైళ్లకు ముహుర్తం ఫిక్స్..ఈ మార్గంలోనే తొలి రైలు!
ఇదే కాకుండా కొన్ని రోజుల కిందట ములుగు జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఓరుగల్లులో ఇదే భారీ ఎన్ కౌంటర్. తెలంగాణ, ఏపీలో తలదాచుకోవాలని చూస్తున్న మావోయిస్టులకు పోలీసులు ఊహించని షాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాల్ పల్లిలో భద్రతా బలగాలు ప్రత్యేక నిఘా పెట్టి ఒక్కరు కూడా రాష్ట్రంలోకి అడుగుపెట్టకుండా జాగ్రత్తపడుతున్నారు.
ఇది కూడా చూడండి: Fire Accident: తిరుమలలో రన్నింగ్ కారులో మంటలు..భయంతో భక్తులు పరుగులు