Suryapet Murder: సూర్యాపేట జిల్లాలో పరువు హత్య కలకలం రేపుతోంది. మామిళ్ళగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అయితే తాజాగా ఈ హత్య కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కృష్ణ బామ్మర్ది నవీన్ తో పాటు బైరి మహేష్ ను అరెస్ట్ చేశారు. వీరితో పాటు మరి ఇద్దరు కూడా ఈ హత్యలో బాగమైనట్లు పోలీసుల సమాచారం. చెల్లి భార్గవిని కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపంతోనే నవీన్ కృష్ణను హత్యచేయించినట్లు తెలిసింది.
ఇది కూడా చదవండి: Johny master : జానీ మాస్టర్ పై కేసు.. తొలిసారి నోరు విప్పిన కొరియోగ్రాఫర్.. సంచలన ఇంటర్వ్యూ!
మందు తాగుదామని పిలిపించి..
అయితే గతంలోనే కృష్ణను ఎప్పటికైనా చంపేస్తామంటూ బెదిరింపులకు గురిచేసిన భార్గవి అన్నయ్య నవీన్. ఆదివారం సాయంత్రం బైరి మహేష్ అనే వ్యక్తి చేత కలిసి మాట్లాడుకుందాం, మందు తాగుదామని ఓ వ్యవసాయ భావి దగ్గరకు పిలిపించారు. అక్కడికి వచ్చిన తర్వాత గొంతు నులిమి, బండరాళ్లతో కొట్టి కృష్ణను దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత శవాన్ని జనగామ రహదారి నుంచి పిల్లలమర్రికి వెళ్లే కెనాల్ కట్టపై పై పడేశారు.
కులాంతర వివాహం..
అయితే ఆరునెలల క్రితం కృష్ణ- భార్గవి ప్రేమించుకొని కులాంతర వివాహం చేసుకున్నారు. కాగా, భార్గవి కులాంతర వివాహం చేసుకోవడం ఆమె అన్న నవీన్ కి ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో కొంతకాలంగా కృష్ణ పై కోపంతో రగిలిపోతున్నాడు. ఈ క్రమంలోనే నవీన్ బైరి మహేష్ అనే వ్యక్తితో కలిసి కృష్ణను హత్య చేయించినట్లు తెలిసింది. మరోవైపు కృష్ణ పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉండడం హఠాత్తుగా మరో అనుమానానికి తెరలేపింది.
ఉరిశిక్ష వేయాలి
నూరేళ్ళ జీవితం తన కళ్ళ ముందే చెదిరిపోవడంతో భార్గవి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. తాను ప్రేమించిన వ్యక్తి ఇక తిరిగిరాడని తెలిసి గుండెలు బాదుకుంటోంది. తన భర్తను చంపిన అన్నయ్యలకు ఉరిశిక్ష వేయాలంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇది ఇలా ఉంటే .. మరోవైపు కృష్ణ పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉండడం హఠాత్తుగా మరో అనుమానానికి తెరలేపింది.
Also Read: Mauni Amavasya: మౌని అమావాస్య రోజు గంగలో మునిగితే పాపాలు పోతాయా? మహాకుంభమేళకు పోటెత్తుతున్న భక్తులు