Biryani : రెస్టారెంట్ ఓనర్ ప్రాణం తీసిన చికెన్ బిర్యానీ!

బిర్యానీ విషయంలో తలెత్తిన వివాదం ఓ చిన్న వివాదం ఏకంగా ఓ రెస్టారెంట్ ఓనర్ ప్రాణాలే తీసింది. వెజ్ బిర్యానీకి బదులు నాన్-వెజ్ బిర్యానీ వడ్డించారనే కోపంతో ఓ కస్టమర్ రెస్టారెంట్ యజమానిపై కాల్పులు జరపగా, ఆయన అక్కడికక్కడే మరణించారు.

New Update
biryani

బిర్యానీ విషయంలో తలెత్తిన వివాదం ఓ చిన్న వివాదం ఏకంగా ఓ రెస్టారెంట్ ఓనర్ ప్రాణాలే తీసింది. వెజ్ బిర్యానీకి బదులు నాన్-వెజ్ బిర్యానీ వడ్డించారనే కోపంతో ఓ కస్టమర్ రెస్టారెంట్ యజమానిపై కాల్పులు జరపగా, ఆయన అక్కడికక్కడే మరణించారు. ఈ దారుణ ఘటన ఝార్ఖండ్ రాజధాని రాంచీలో చోటుచేసుకుంది. బాధితుడు విజయ్ కుమార్ నాగ్ (47), కాంకే పిథోరియా రోడ్డులోని చెఫ్ చౌపట్టి రెస్టారెంట్ ను నడిపిస్తున్నాడు. అయితే శనివారం రాత్రి ఒక కస్టమర్ రెస్టారెంట్ నుంచి వెజ్ బిర్యానీ పార్సెల్ తీసుకువెళ్లాడు.

Also Read : IND Vs AUS 2nd ODI: టీమిండియాకు బిగ్ షాక్.. రోహిత్ శర్మ సహా ముగ్గురు ప్లేయర్స్ ఔట్

ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం

అయితే ఇంటికి వెళ్లి చూస్తే, అందులో నాన్-వెజ్ బిర్యానీ ఉన్నట్లు గుర్తించాడు. దీంతో ఆగ్రహించిన ఆ కస్టమర్ మరికొంతమందితో కలిసి రెస్టారెంట్‌కు తిరిగి వచ్చాడు. అక్కడ భోజనం చేస్తున్న యజమాని విజయ్ నాగ్‌ను నిలదీశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. గొడవ తారాస్థాయికి చేరడంతో, నిందితుడు తన వద్ద ఉన్న తుపాకీ తీసి విజయ్ నాగ్ ఛాతిపై కాల్పులు జరిపాడు. కాల్పులు జరిగిన వెంటనే విజయ్ నాగ్ కుప్పకూలిపోయాడు. అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూశాడు. నిందితులు వెంటనే సంఘటన స్థలం నుంచి పారిపోయారు.

 సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అభిషేక్ సింగ్గా పోలీసులు గుర్తించారు. ఆదివారం రాత్రి నిందితుడు అభిషేక్ సింగ్‌ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసు బృందంపై అతడు కాల్పులు జరపగా, పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో అభిషేక్ సింగ్‌కు బుల్లెట్ గాయాలు కాగా, పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బిర్యానీ వివాదంతో పాటు, ఈ హత్య వెనుక మరేదైనా పాత కక్షలు లేదా భూ వివాదాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటనపై స్థానికులు, వ్యాపార వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలంటూ కాంకే పిథోరియా రోడ్డుపై నిరసన ప్రదర్శనలు, రాస్తారోకో నిర్వహించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Advertisment
తాజా కథనాలు