Rajasthan : మేకలను చంపాయని... కుక్కలను వెతికి వెతికి మరీ చంపేశాడు!

రాజస్థాన్ లో దారుణం జరిగింది. జంతు హింసకు సంబంధించిన దిగ్భ్రాంతికరమైన కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఝుంఝును జిల్లాలో ఆగస్టు 2, 3 తేదీల్లో 25 కి పైగా కుక్కలను తుపాకీతో కాల్చి చంపాడో వ్యక్తి.

New Update
rajasthan

రాజస్థాన్ లో దారుణం జరిగింది. జంతు హింసకు సంబంధించిన దిగ్భ్రాంతికరమైన కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఝుంఝును జిల్లాలో ఆగస్టు 2, 3 తేదీల్లో 25 కి పైగా కుక్కలను తుపాకీతో కాల్చి చంపాడో వ్యక్తి.  ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.నవాల్‌గఢ్ ప్రాంతంలోని కుమావాస్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. వీడియోలో ఒక వ్యక్తి తుపాకీతో రోడ్డుపై తిరుగుతూ కనిపించగానే కుక్కలను కాల్చి చంపుతున్నాడు. 

Also Read : SI Murder : తండ్రికొడకుల గొడవను ఆపేందుకు వెళ్లిన ఎస్సైని దారుణంగా నరికి చంపారు!

రక్తంతో తడిసిన వాటి కళేబరాలు గ్రామం అంతటా చెల్లాచెదురుగా పడి ఉండటం కనిపిస్తుంది.  సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారడంతో   ఆగస్టు 4న పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిందితుడిని దుమ్రా గ్రామానికి చెందిన సూరజారామ్ బవరియా కుమారుడు ష్యోచంద్ బవరియా గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణలో నిందితుడు ఆ కుక్కలు తన మేకలను చంపేశాయని, అందుకే ప్రతీకారంగా గ్రామంలోని అన్ని వీధి కుక్కలను చంపాలని ఇలా చేశానని వెల్లడించాడు. అంతేకాకుండా చనిపోయిన మేకలకు పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశాడు. అయితే అతనికి రైఫిల్ ఎలా వచ్చిందో పోలీసులకు వెల్లడించలేదు. అతనిపై జంతు హింస, ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన జంతు ప్రేమికులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read :  Dharmasthala : ధర్మస్థలలో హైటెన్షన్ .. జర్నలిస్టులపై దాడి.. అసలు ఏం జరుగుతోంది?

చట్టరీత్యా నేరం

జంతు హింస మన దేశంలో చట్టరీత్యా నేరం జంతు హింస నివారణ చట్టం 1960 ప్రకారంజంతువులను హింసించడం, కొట్టడం  వంటివి చేయరాదు. ఈ చట్టం ప్రకారం, ఎవరైనా జంతువులను హింసిస్తే వారికి జరిమానా లేదా జైలు శిక్ష విధించబడుతుంది. కేంద్ర ప్రభుత్వం జంతువుల సంరక్షణకు సంబంధించి ఇటీవల అనేక కఠినమైన చర్యలు తీసుకుంది. కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులను హింసించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అంతేకాకుండా, జంతువులపై ప్రయోగాలు చేసే సంస్థలపై కూడా నిఘా పెట్టింది.  జంతువులపై హింస లేదా క్రూరత్వం జరిగినట్లు మీకు తెలిస్తే, మీరు వెంటనే సమీపంలోని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. 

Also Read :  Bihar crime : అన్యమతస్థుడితో అక్రమ సంబంధం.. వివాహితను గుండు గీయించి ఊరేగించారు!

Advertisment
తాజా కథనాలు