/rtv/media/media_files/2025/08/07/youtubers-2025-08-07-10-30-57.jpg)
ధర్మస్థలలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మీడియాపై వీరేంద్ర హెగ్డే అనుచరుల దాడి చేయడంతో నలుగురు జర్నలిస్టులకు గాయాలు, కెమెరాలు ధ్వంసం అయ్యాయి. ధర్మస్థల హత్యల విషయంలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో స్థానిక ప్రజలు మీడియాకు మద్దతుగా నిలిచారు. దీంతో స్థానికులు, వీరేంద్ర హెగ్డే అనుచరుల మధ్య ఘర్షణ మొదలైంది. పరిస్థితి చేయి దాటడంతో కంట్రోల్ చేయడానికి పోలీసుల లాఠీఛార్జ్ చేపట్టారు. మృతదేహాల కోసం తవ్వకాలు జరిపే 13వ నంబర్ లొకేషన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ధర్మస్థలంలో 5 బెటాలియన్ల పోలీసులు భారీగా మోహరించారు.
Five YouTubers—Ajay Anchan, Santosh (Sanchari Studio), Abhishek (United Media), a cameraman, and another—were attacked in Dharmasthala on Aug 6, 2025, by local residents protesting "negative media coverage" of the secret burials case. Reporter Harish Ramaswamy was assaulted while…
— Grok (@grok) August 6, 2025
పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌లు
ఈ ఘటనపై ధర్మస్థల పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. జర్నలిస్టులపై జరిగిన దాడులను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), డివైఎఫ్‌ఐ, డిజిటల్ మీడియా ఫర్ డెమోక్రసీ ఖండించాయి. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని సిపిఐ(ఎం) కర్ణాటక కార్యదర్శి కె. ప్రకాష్ డిమాండ్ చేశారు. ధర్మస్థల ప్రాంతంలో గత రెండు దశాబ్దాలుగా వందల సంఖ్యలో హత్యలు, లైంగిక వేధింపులు జరిగాయని, వాటికి సంబంధించిన మృతదేహాలను పూడ్చిపెట్టారని ఓ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ను ఏర్పాటు చేసింది. సిట్ బృందం దర్యాప్తు కొనసాగిస్తోంది.
ధర్మస్థల కేసు దర్యాప్తులో అనేక సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తవ్వకాలు కొనసాగిస్తోంది. ఈ కేసులో ప్రధానంగా నలుగురు జర్నలిస్టులపై దాడి, అసహజ మరణాల రికార్డుల మాయం కావడం, కొత్త సాక్షులు ముందుకు రావడం వంటి అంశాలు కీలకంగా మారాయి. గత వారం రోజుల నుంచి సిట్ బృందం తవ్వకాలు జరుపుతోంది. ఈ తవ్వకాలలో కొన్ని మానవ శరీర అవశేషాలు బయటపడినట్లు సమాచారం. వీటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు.
ఈ కేసులో కొత్త సాక్షులు ముందుకు వస్తున్నారు. మాజీ పారిశుద్ధ్య కార్మికుడు భీమా ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తవ్వకాలు జరుపుతున్నప్పటికీ, కొత్తగా మరో వ్యక్తి కూడా ముందుకు వచ్చి తాను 15 ఏళ్ల క్రితం జరిగిన ఓ మైనర్ బాలిక హత్యకు సంబంధించిన వివరాలు చెబుతానని సిట్ ను ఆశ్రయించారు. తవ్వకాలలో మానవ అవశేషాలను మరింత ఖచ్చితంగా గుర్తించడానికి గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (GPR) సాంకేతికతను ఉపయోగించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ సాంకేతికతను ఉపయోగించే విషయమై సిట్ ఇంకా స్పందించలేదు.