/rtv/media/media_files/2025/06/12/SktteWBqo05xcB9vhMGY.jpg)
punjab social media influencer kamal kaur murder
ఇటీవలే పాకిస్థాన్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సనా యూసఫ్ హత్య ఘటన మరువక ముందే.. మరో సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్ దారుణ హత్యకు గురైంది. బుధవారం సాయంత్రం పంజాబ్ కి (punjab) చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కమల్ కౌర్ (kamal kaur) అలియాస్ కాంచన్ కుమారి మృతదేహం అనుమాస్పద స్థితిలో లభ్యమైంది.
Also Read: దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల ఆనారోగ్య సమస్యలు పరార్
కారులో డెడ్ బాడీ
పంజాబ్ లోని లూధియానా ప్రాంతంలో నివాసం ఉంటున్న కమల్ కౌర్ సోషల్ మీడియాలో రీల్స్ , వ్లాగ్స్, వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ తెచ్చుకుంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 3 లక్షలకు పైగా ఫాలోవర్లు కూడా ఉన్నారు. అయితే పలు కథనాలు తెలిపిన వివరాల ప్రకారం.. కమల్ జూన్ 9న తన తల్లికి ఒక ప్రమోషనల్ ఈవెంట్ కి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలు దేరింది. ఆ తర్వాత జూన్ 11న మృతదేహమై కనిపించింది. బుధవారం సాయంత్రం చండీగఢ్ జాతీయ రహదారిపై ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రి వద్ద పార్క్ చేసిన కారులో కమల్ డెడ్ బాడీని గుర్తించారు.
Also Read : ‘తల్లికి వందనం’ రూ.13వేలే.. రూ.2వేలు కట్ - ఎందుకంటే?
Also Read : కాళేశ్వరం విచారణలో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి తుమ్మల.. రేవంత్ బిగ్ స్కెచ్ ఇదేనా?
ఎలా బయటపడింది?
అయితే కారు నుంచి ఏదో దుర్వాసన వస్తుండడంతో అక్కడి స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పార్కింగ్ ఏరియాలో తనికీ చేయగా.. కారులో ఉన్న కమల్ డెడ్ బాడీ బయటపడింది. జూన్ 9న ఇంటి నుంచి బయటకు వెళ్లిన కమల్ ని జూన్ 10న వేరే ప్రదేశంలో హత్య చేసి.. ఆ తర్వాత డెడ్ బాడీని కారులో తీసుకొచ్చి ఆస్పత్రి వద్ద పార్క్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
/rtv/media/media_files/2025/06/12/8H8sau8WsoeUa8BgkfRF.png)
ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు తర్వాతే మరణానికి గల అసలు కారణం బయటపడుతుందని పోలీస్ అధికారులు తెలిపారు. కమల్ డెడ్ బాడీ దొరికిన కారు లూథియానా నెంబర్ ప్లేట్ ని కలిగి ఉందని చెబుతున్నారు. మరోవైపు అది నకిలీ నెంబర్ ప్లేట్ అయి కూడా ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read: Gopichand33 Glimpse: గోపిచంద్ బర్త్‌డే స్పెషల్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న గ్లింప్స్
telugu-news | Latest News | Punjab crime | punjab influencer murder