గుజరాత్‌లో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అమ్రేలి జిల్లా గిరియా ప్రాంతంలో ఓ ప్రైవేట్ ఫ్లైట్ కుప్పకూలిపోయింది. విమానం కూలిపోగానే భారీ పేలుడు సంభవించింది. పైలట్‌కు ట్రైనింగ్ ఇస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ట్రైనీ పైలట్ సోలో అనికేత్ మహాజన్ అక్కడికక్కడే మరణించాడు. ఫ్లైట్‌లో ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు.
Also read: New Pope: కొత్త పోప్ ఎన్నికలో కీలకంగా నలుగురు ఇండియన్ కార్డినల్స్
ప్లేన్ క్రాష్ అవ్వడంతో చుట్టుపక్కల ప్రాంతంలో భయానక వాతావరణం ఏర్పడింది. అగ్నిమాపక శాఖ, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. కొంతకాలం క్రితం ట్రైనీ లేడీ పైలట్ నడుపుతున్న విమానం మెహ్సానాలోని ఒక గ్రామ శివార్లలో కూలిపోయింది. ఆప్రమాదంలో ఆ మహిళా పైలట్ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు.
(plane crashes | aeroplane crashes | plane crashes caught | amreli news | gujarath | latest-telugu-news)