New Update
/rtv/media/media_files/2025/02/09/NgYiYjP2sdSJhbfNzNfj.jpg)
son killed father
Prakasam District: రోజు రోజుకూ సమాజంలో మానవత్వం అనేది కనుమరుగైపోతుంది. డబ్బు, పగ ప్రతీకారాల కోసం ఒక మనిషి మరొక మనిషిని హతమార్చే స్థాయికి దిగజారుతున్నారు. కనీస మానవీయ విలువలు మర్చిపోయి.. తండ్రిని కొడుకు, కొడుకు తండ్రని, భర్తలు భార్యలను చంపుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి ఓ ఘటనే ప్రకాశం జిల్లా (Prakasam District) లో చోటుచేసుకుంది. డబ్బులు ఇవ్వలేదని కొడుకు తండ్రిని రంపంతో కోసి చంపడం కలకలం రేపుతోంది.
Also Read: Allu Aravind: బన్నీ డ్యాన్స్ చిరంజీవి నుంచి వచ్చింది కాదు.. అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్!
చెట్లు కోసే రంపంతో..
అయితే ప్రకాశం జిల్లా దొనకొండ మండలం ఇండ్లచెరువు గ్రామం ఎస్సీ కాలనీలో పైడిపోగు యేసయ్య (64) అనే వ్యక్తి అతని కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. అయితే యేసయ్య రెండవ కుమారుడు మరిదాసు శనివారం మద్యం సేవించేందుకు తండ్రిని డబ్బులు అడగ్గా ఇవ్వలేదు. దీంతో విచక్షణ కోల్పోయిన మరిదాసు రాత్రి మద్యం సేవించి వచ్చి.. ఆ మత్తులో చెట్లు కోసే రంపంతో తండ్రిని హతమార్చాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అతడిని బంధించి పోలీసులకు అప్పగించారు.
తాజా కథనాలు