Prajwal Revanna: జైల్లో జీతగాడిలా మాజీ MP.. ప్రజ్వల్ రేవణ్ణకు రూ.522 రోజుకూలీ

కర్ణాటకలో సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఆయనకు కొత్త బాధ్యతలను అప్పగించారు. జైలు అధికారులు ఆయనను లైబ్రరీ క్లర్క్‌గా నియమించారు.

New Update
Prajwal Revanna

Prajwal Revanna

కర్ణాటకలో సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఆయనకు కొత్త బాధ్యతలను అప్పగించారు. జైలు అధికారులు ఆయనను లైబ్రరీ క్లర్క్‌గా నియమించారు. జైలు నిబంధనల ప్రకారం జీవిత ఖైదు పడిన ఖైదీలు ఏదో ఓ పని చేయాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా ఆయనకు ఈ పని అప్పగించారు.

ప్రజ్వల్ రేవణ్ణ తోటి ఖైదీలకు పుస్తకాలు ఇవ్వడం, వాటి రికార్డ్స్ మెయిన్‌టైన్ చేయడం వంటి బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ పనికి గాను ఆయనకు ప్రతి రోజు రూ.522 జీతం లభిస్తుంది. సాధారణంగా ఖైదీలు వారానికి కనీసం 3 రోజులు, నెలకు 12 రోజులు పని చేయాల్సి ఉంటుంది. అయితే, ప్రజ్వల్ రేవణ్ణ కోర్టు విచారణలకు, తన న్యాయవాదులను కలవడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుండటంతో, ఆయన పని షెడ్యూల్ పరిమితంగా ఉంటుందని అధికారులు తెలిపారు.

గతంలో ఎంపీగా ఉన్న ప్రజ్వల్ రేవణ్ణకు, లైంగిక వేధింపుల కేసులో జీవిత ఖైదు శిక్ష పడటం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కేసులో ఆయనపై అత్యాచారం, లైంగిక వేధింపులు, సాక్ష్యాలను నాశనం చేయడం వంటి అనేక ఆరోపణలు ఉన్నాయి. విచారణలో ఆయన దోషిగా తేలడంతో కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది.

జైలు అధికారులు ఆయన నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకుని ఈ పనిని కేటాయించారు. ఈ నిర్ణయం సమాజంలో భిన్నమైన స్పందనలను రేకెత్తిస్తోంది. ఒకప్పుడు అధికారంలో ఉన్న ఒక రాజకీయ నాయకుడు, ఇప్పుడు జైలులో సాధారణ ఖైదీలా పనిచేస్తున్నాడని విని షాక్‌కు గురైతున్నారు. అయితే, జైలు రూల్స్ ప్రకారం ఇది తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు