Italy: టేకాఫ్‌ అవుతుండగా విమానంలో మంటలు...!

ఇటలీలో పెద్ద విమాన ప్రమాదం తప్పింది. టేకాఫ్‌ కి సిద్ధపడుతుండగా హఠాత్తుగా విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే పైలట్‌, సిబ్బంది..ప్రయాణికులను కిందకు దించేసి విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు.

New Update
flight

Italy Flight: ఇటలీలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. టేకాఫ్‌ కి సిద్ధపడుతుండగా హఠాత్తుగా విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే పైలట్‌, సిబ్బంది..ప్రయాణికులను కిందకు దించేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: స్వర్ణమయం కానున్న యాదాద్రి ఆలయ గోపురం

ఇటలీలోని బ్రిండిసి విమానాశ్రయం నుంచి గురువారం ర్యాన్‌ఎయిర్ బోయింగ్ 737-8AS విమానం టేకాఫ్‌కు రెడీ అవుతుంది. కానీ టేకాఫ్ అయ్యేలోపే ఫ్లైట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 

Also Read: ఇజ్రాయెల్ ఎయిర్‌‌స్ట్రైక్..హమాస్ ఛీఫ్ హతం

పైలట్ కుడి ఇంజిన్‌లో మంటలను గుర్తించి వెంటనే టేకాఫ్‌ను నిలిపివేశాడు. సంఘటన జరిగిన వెంటనే ప్రయాణికులను అత్యవసర ద్వారాల ద్వారా కిందకు దించేశారు. అగ్నిమాపక సిబ్బంది విషయం తెలుసుకున్న వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. ఈ ఘటన కారణంగా బ్రిండిసి పపోలా కాసలే విమానాశ్రయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేసేశారు. 

Also Read: తెలంగాణలో  రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో వానలు!

ఇంజిన్‌లో లోపాలు తలెత్తడంతోనే ఈ మంటలు చెలరేగినట్లుగా అధికారులు వివరించారు. మంటలు చెలరేగినప్పుడు విమానంలో దాదాపు 200 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలను చూసిన పైలట్ వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అటు అధికారులతో పాటు, ప్రయాణికులు కూడా అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: అమ్మాయిలు అదిరిపోయే ఆరంభం ఇస్తారా..

Advertisment
Advertisment
తాజా కథనాలు