గన్నవరం మాజీ ఎమ్మెల్యే పీఏ అరెస్ట్

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పీఏని పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ ప్రభుత్వ సమయంలో గన్నవరం టీడీపీ కార్యాలయంలపై దాడి కేసులో వంశీ పీఏతో పాటు మొత్తం 11 మంది అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా కొందరిని అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

New Update
Vallabhaneni vamsi: వల్లభనేని వంశీ అరెస్ట్‌కు రంగం సిద్ధం

వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో గన్నవరం టీడీపీ కార్యాలయంలపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి కేసులో ఎన్టీఆర్ జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పీఏని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇది కూడా చూడండి: శబరిమల యాత్రికులకు గుడ్‌న్యూస్.. దర్శనానికి ప్రత్యేక పోర్టల్

మరికొందరిని కూడా అదుపులోకి..

వంశీ పీఏతో పాటు అతని అనుచరులు మొత్తం 11 మందిని పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు విజయవాడ, గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరుకు చెందిన ఇంకొందరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయనున్నట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో టీడీపీ కార్యాలయంపై దాడులు చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఈ విషయన్ని సీరియస్‌గా తీసుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. 

ఇది కూడా చూడండి:  రిక్టర్ స్కేల్‌పై 7.0 తీవ్రతతో భారీ భూకంపం.. ఎక్కడంటే?

ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే అయిన వల్లభనేని వంశీని కొన్ని నెలల కిందట పోలీసులు అరెస్టు చేశారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ A 71గా ఉన్నారు. వల్లభనేని వంశీ హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తుండగా ఏపీ పోలీసులు వాహనాన్ని వెంబడించిన అతడిని అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి చేశారనే ఆరోపణలు వచ్చాయి. 

ఇది కూడా చూడండి: నేటి నుంచే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు

ఈ క్రమంలోనే వల్లభనేని వంశీతో పాటు అతని అనుచరులు 18 మందిని అరెస్ట్ చేశారు. వంశీ ప్రోద్బలంతోనే టీడీపీ ఆఫీసు దాడి జరిగిందనే ఆరోపణలు వినిపించాయి. అప్పుడు అరెస్ట్ అయిన వారిలో వంశీ ప్రధాన అనుచరులు ఉన్నారు. మూల్పూరి ప్రభుకాంత్, నగేష్, డొక్కు వెంకన్నబాబు, నాగరాజు, డ్రైవర్ దుర్గారావు, కరీముల్లా, రెబ్బాని సహా మరో 8మంది ఉన్నారు. నూజివీడు సబ్ జైలుకు 15 మంది నిందితులను తరలించారు. 

ఇది కూడా చూడండి: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఒకేసారి రెండు కోర్సులు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు