/rtv/media/media_files/2025/09/09/police-dance-with-women-2025-09-09-13-28-38.jpg)
Police Dance With Women
మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. దతియా జిల్లా పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు పోలీసులు పుట్టినరోజు వేడుకల్లో బార్ డ్యాన్సర్లతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో వారిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో పాలుపంచుకున్న ఏఎస్ఐ, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Police Dance With Women
దతియా పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ తన పుట్టినరోజు వేడుకలను ఒక హోటల్‌లో జరుపుకున్నాడు. ఈ వేడుకకు అదే స్టేషన్‌కు చెందిన ఒక అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్ఐ) ను ఆహ్వానించాడు. ఈ పార్టీకి ఇద్దరు ప్రొఫెషనల్ బార్ డ్యాన్సర్లను కూడా ఆహ్వానించాడు. అందులో బాలీవుడ్ పాటలకు ఏఎస్ఐ, కానిస్టేబుల్ బార్ డ్యాన్సర్లతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ దృశ్యాలను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పోలీసులు యూనిఫామ్‌లో లేకుండా సాధారణ దుస్తుల్లో కనిపించారు.
కానిస్టేబుల్ పుట్టినరోజు వేడుకల్లో బార్ డ్యాన్సర్లతో డ్యాన్స్ వేసిన ASI, కానిస్టేబుల్
— greatandhra (@greatandhranews) September 9, 2025
మధ్యప్రదేశ్‌లోని దతియా పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులుగా గుర్తింపు
వీడియో వైరల్ కావడంతో వారిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు pic.twitter.com/6KkAZSD4xV
ఈ వీడియో వైరల్ అయిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించారు. పోలీసుల వృత్తికి, నైతిక విలువలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు గాను దాటియా ఎస్పీ సూరజ్ వర్మ ఇద్దరు పోలీసులను తక్షణమే సస్పెండ్ చేశారు. అంతేకాకుండా ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. ఇటువంటి చర్యలు పోలీసు వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగిస్తాయని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు.
ఈ సంఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులు ఇలాంటి వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం దారుణమని, ఇది సమాజానికి తప్పుడు సందేశం ఇస్తుందని విమర్శించారు. ఒకవైపు మహిళల భద్రత, గౌరవం గురించి పోలీసులు ప్రచారం చేస్తుంటే, వారే ఇలాంటి చర్యలకు పాల్పడటం గమనార్హమని పలువురు వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై విపక్ష పార్టీలు కూడా స్పందించాయి. పోలీసుల ప్రవర్తనపై ప్రభుత్వం దృష్టి సారించాలని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.