TikTok Star Murder Video: లైవ్‌లోనే టిక్ టాక్ స్టార్ దారుణ హత్య.. వీడియో ఇదిగో!

మెక్సికో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, టిక్‌టాక్ స్టార్ వలెరియా మార్కెజ్(23) దారుణ హత్యకు గురైంది. ఓ సెలూన్‌లో మార్కెజ్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండగా దుండగుడు వచ్చి వలెరియా నువ్వేనా? అని అడిగి ఛాతీ, తలపై గన్నుతో కాల్చేశాడు. అక్కడిక్కడే ఆమె మృతి చెందింది.

New Update
Mexico tik tok star

TikTok Star Murder Video

మెక్సికో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్(Mexico Social Media Influencer), టిక్‌టాక్ స్టార్ వలెరియా మార్కెజ్(Valeria Marquez)(23)ను దారుణంగా హత్య చేశారు. గౌడలజరా నగరంలో ఓ సెలూన్‌లో మార్కెజ్ లైవ్ స్ట్రీమింగ్(Live Streaming) చేస్తోంది. అక్కడికి ఓ దుండగుడు వచ్చి వలెరియా నువ్వేనా? అని అడిగాడు. ఆమె అవును అనగానే ఛాతీ, తలపై గన్నుతో కాల్చేశాడు. అక్కడిక్కడే వలెరియా మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే వలెరియా మార్కెజ్ ఒక సలోన్‌లో వర్క్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మంచి పాపులారిటీని సంపాదించుకుంది.  

ఇది కూడా చూడండి:Balochistan: మమ్మల్ని స్వతంత్ర దేశంగా గుర్తించండి..బలూచ్ నాయకుడి భావోద్వేగ పోస్ట్

ఇది కూడా చూడండి:Ind-Pak war: చైనా ఎయిర్ డిఫెన్స్ రక్షణ వ్యవస్థలు 23 నిమిషాల్లోనే ధ్వంసం..కేంద్రం

మహిళలనే టార్గెట్ చేసి..

గత కొన్ని రోజుల నుంచి మెక్సికోలో ఎక్కువగా ఫెమిసైడ్ హత్యలు జరుగుతున్నాయి. జెండర్ కారణంగా మహిళలను పురుషులు హత్యలు చేయడాన్నే ఫెమిసైడ్ అంటారు. అయితే వీటిలో 50 శాతం హత్యలను ఇతరులు కంటే కుటుంబ సభ్యులు, ప్రేమికులే చేస్తుంటారు. వలెరియాను కూడా తన అభిమాని లేదా ప్రేమికుడు హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే వలెరియా అంతకు ముందే తనని కలవడానికి ఓ అభిమాని వస్తున్నట్లు తెలిపింది. అయితే లైవ్‌లో వలెరియాను చంపేసి ఆ యువకుడు మొబైల్ తీసుకుని వెళ్లిపోయాడు. ఈ క్రమంలో లైవ్‌లో కొంత సమయం మాత్రమే ఆ యువకుడి ఫేస్ కనిపించినట్లు పోలీసులు తెలిపారు. 

ఇది కూడా చూడండి:Revanth Reddy : కేటీఆర్ కింద కాదు కొప్పుల కింద పనిచేస్తే గొప్ప..హరీష్ రావుకు సీఎం రేవంత్ చురకలు

Advertisment
తాజా కథనాలు