Wife Beated Husband: షాకింగ్ వీడియో.. నడిరోడ్డుపై భర్త కాలర్ పట్టుకుని చితకబాదిన భార్య

మీరట్‌లో ఒక మహిళ రోడ్డు మధ్యలో తన భర్తను కాలర్ పట్టుకుని పదేపదే కొట్టిన వీడియో వైరల్‌గా మారింది. నాలుగు నెలల క్రితం పెళ్లి చేసుకున్న దినేష్, ఇషు జంట కొద్ది రోజుల నుంచి గొడవపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కోపంతో ఉన్న ఆ మహిళ తన భర్తను రోడ్డుపై కొట్టింది.

New Update
meerut wife grabs husband

meerut wife grabs husband

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో విచిత్ర సంఘటన జరిగింది. ఓ మహిళ తన భర్తను నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే చెంపలు వాయించింది. పిల్టీ పట్టుకుని కొట్టింది. ఈ ఘటన చుట్టూ ఉన్న ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

meerut wife beated husband

దినేష్ అనే యువకుడు ఇషు అనే యువతిని నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత నుంచి ఇద్దరి మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. ఇందులో భాగంగానే సోమవారం దినేష్ తన వ్యాగన్ఆర్ కారుపై వెళ్తుండగా.. ఒక్కసారిగా అతని భార్య ఇషు రోడ్డుపై ఆపి బానెట్ ఎక్కింది. చుట్టూ ఉన్న స్థానికులు ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు. కొందరు అతన్ని ఆపడానికి ప్రయత్నించగా, ఇంకొందరు ఈ సంఘటనను వీడియోలు తీశారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత, ఆ వ్యక్తి తన కారును ఆపాడు. అనంతరం కారు ఆగిన వెంటనే, ఆ మహిళ బానెట్ నుంచి కిందికి దిగి తన భర్త చెంపలను వాయించింది. 

అక్కడితో ఆగకుండా ఆ మహిళ తన భర్తను పిల్టీ పట్టుకుని కొట్టింది. ఈ గొడవ కారణంగా రోడ్డు జామ్ అయింది. అలా రోడ్డుపై వెళ్తున్న జనం కూడా చుట్టూ గుమిగూడారు. కొందరు ఆ భార్య, భర్తల గొడవలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించగా, మరికొందరు ఈ సంఘటన మొత్తాన్ని తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు. ఈ వ్యవహారమంతా మహిళా పోలీస్ స్టేషన్ ఎదురుగానే జరగడం గమనార్హం. అయినప్పటికీ ఆ మహిళ తన భర్తపై ఉన్న కోపాన్ని కంట్రోల్ చేయలేదు. అంత రద్దీగా ఉండే రోడ్డులో కూడా ఆ మహిళ తన భర్తను బహిరంగంగా కొట్టడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు.

ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే మహిళా పోలీసు అధికారులు, మహిళా స్టేషన్ ఇన్స్పెక్టర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు పరిస్థితిని అదుపు చేసి భార్యాభర్తలిద్దరినీ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. భార్యాభర్తల మధ్య జరిగిన వివాదం కారణంగానే ఈ సంఘటన జరిగిందని పోలీసు అధికారులు చెప్పారు. చాలా కాలం నుంచి వారి మధ్య గొడవలు జరుగుతున్నాయని.. ఆ వివాదం ఈ సంఘటనకు దారితీసిందని అన్నారు.

Advertisment
తాజా కథనాలు