మెదక్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. యువతి ప్రేమించడం లేదని ఓ యువకుడు ప్రేమోన్మాది దాడి చేశాడు. మెదక్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఎదుట యువతి చేయిని కోసి పరారయ్యాడు. యువతి చేతికి తీవ్రంగా గాయాలు కావడంతో చికిత్స కోసం వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఇంకా విషమించడంతో వెంటనే హైదరాబాద్ తరలించారు. యువకుడు బెంగళూరుకి చెందిన చేతన్‌గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆ యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇది కూడా చూడండి: ఏపీలో పింఛన్‌దారులకు బంపర్ ఆఫర్.. మూడు నెలల పెన్సన్ ఒకేసారి!
పెరుగుతున్న ఘటనలు
ఇదిలా ఉండగా యువతులు, మహిళలను వేధించే ఘటనలు ఈమధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. చెప్పిన పనులు చేయడం లేదని, ప్రేమను ఒప్పుకోలేదని, విసిగిస్తున్నారని ఫిర్యాదు చేసిన కొందరు దుర్మార్గులు ఇలానే ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఓ డాక్టర్‌ను కూడా యువకుడు ఇలానే వేధించాడు. బైక్ బుక్ చేసుకుని క్యాన్సిల్ చేసిందనే ఉద్దేశంతో ఆమె నంబర్ సేవ్ చేసుకుని టార్చర్ చూపించాడు.
ఇది కూడా చూడండి: ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.25 కోట్లు స్వాహా
కోల్‌కతా పట్టణంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తోన్న మహిళ బైక్ బుక్ చేసుకుంది. బైక్ రావడానికి ఆలస్యం కావడంతో తన రైడ్‌ను క్యాన్సిల్ చేసుకుంది. దీంతో సదరు బైకర్ ఆమెకు 17 సార్లు ఫోన్ చేశాడు. ఆమె స్పందించకపోవడంతో వాట్సప్ నంబర్‌కు రతికి సంబంధించిన వీడియోలు పంపించాడు. పదే పదే కాల్, మెసేజ్‌లు చేసేవాడు. చివరికి బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు.
ఇది కూడా చూడండి: నేడు కార్తీక సోమవారం.. శివుడిని ఎలా పూజించాలంటే?
ఇవన్నీ భరించలేక, భయాందోళనకు గురైన ఆమె పుర్బా జాదవ్‌పుర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు వెంటనే నిందితుడిపై కేసు నమోదు చేసి పట్టుకున్నారు. పలు సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: ఏపీలో పెను విషాదం.. కరెంట్ షాక్‌తో నలుగురు వ్యక్తులు?