ఏపీలో పెను విషాదం.. కరెంట్ షాక్‌తో నలుగురు వ్యక్తులు?

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో కరెంట్ షాక్‌తో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణలో ఫ్లెక్సీలు కడుతుండగా ఈ విషాద ఘటన జరిగింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇస్తూ.. రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు.

New Update
Undrajavaram

తూర్పుగోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఫ్లెక్సీలు కడుతూ కరెంట్‌ షాక్‌కు గురై నలుగురు యువకులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణలో భాగంగా ఉండ్రాజవరం మండలం తాటిపర్రు గ్రామంలో ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్ తగిలింది. ఈ విషాద ఘటనలో బొల్లా వీర్రాజు, పామర్తి నాగేంద్ర, మారిశెట్టి మణికంఠ, కాసగాని కృష్ణ నలుగురు అక్కడిక్కడే మరణించగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఇది కూడా చూడండి: ఏపీలో ఫించన్‌దారులకు బంపర్‌ ఆఫర్‌.. మూడు నెలల పెన్సన్ ఒకేసారి!

క్షత్రగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని..

విద్యుత్ షాక్ క్షతగాత్రులను వెంటనే తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంత్రులు కందుల దుర్గేశ్, వాసంశెట్టి సుభాష్ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి యాజమాన్యానికి తెలిపారు. వైపీపీ ప్రభుత్వం సర్దాన్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని పెట్టేందుకు గతంలో అనుమతి ఇవ్వలేదని మంత్రి సుభాష్ అన్నారు. 

ఇది కూడా చూడండి: ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.25 కోట్లు స్వాహా

మేం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ సమస్యను పరిష్కరించి విగ్రహం పెట్టుకుందుకు అనుమతి ఇచ్చామన్నారు. దురదృష్టవసాత్తు ఫ్లెక్సీలు పెట్టే సమయంలో విద్యుత్ షాక్ గురై నలుగురు మృతి చెందారు. మృతుల కుటుంబాలను తప్పకుండా ఆదుకుంటామని మంత్రి సుభాష్ తెలిపారు. 

ఇది కూడా చూడండి:  నేడు కార్తీక సోమవారం.. శివుడిని ఎలా పూజించాలంటే?

ఈ విద్యుత్ ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందడం చాలా బాధాకరమని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలను తప్పకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. 

ఇది కూడా చూడండి:  విషాదం.. గొంతులో కోడి గుడ్డు ఇరుక్కుని..

Advertisment
Advertisment
తాజా కథనాలు