Allergy: ఇంటి చిట్కాలతో అలెర్జీని సులభంగా పోగొట్టుకోండి

డస్ట్ అలర్జీ అనేది సాధారణ సమస్య. అలర్జీ ఉంటే రాక్ ఉప్పు వేడినీటిలో కరిగించి ఆవిరి పట్టుకోవాలి. తులసి ఆకులు, పసుపు వేసి మరిగించిన కషాయాలను తాగినా, అల్లం, తేనె రసం ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగినా డస్ట్ అలర్జీ చాలా వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Allergy

Allergy

Allergy: దుమ్ము, కాలుష్యం వల్ల డస్ట్ అలర్జీ వస్తుంటుంది. దీనివల్ల తుమ్ములు, ముక్కు కారడం లేదా తలనొప్పి మొదలవుతుంది. డస్ట్ అలర్జీ అనేది చాలా సాధారణ సమస్య. దీనివల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఆస్తమా లేదా శ్వాస సమస్యలతో బాధపడే వారు ఈ అలర్జీ వల్ల తరచుగా ముక్కు కారడం, తుమ్ములు, కళ్లలో దురద, కళ్లు ఎర్రబడడం, గొంతులో స్ట్రెయిన్ వంటి సమస్యలను ఎదుర్కొంటారు. కొన్ని నేచురల్ హోం రెమెడీస్ పాటించడం వల్ల డస్ట్ అలర్జీని చాలా వరకు తగ్గించుకోవచ్చు. 

చెంచా తేనె- తాజా అల్లం రసం:

అలర్జీ ఉంటే కప్పు వేడి నీటిలో రాక్ ఉప్పును కరిగించి. ఈ నీటిని ఆవిరి పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ధూళి కణాలన్నీ బయటకు వస్తాయి. ఇది ముక్కును శుభ్రపరుస్తుంది. గొంతు వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. దుమ్ము, బ్యాక్టీరియాను తొలగిస్తుందని నిపుణులు అంటున్నారు. అలెర్జీ ఉన్నవారికి అల్లం, తేనె రెండూ సహజ యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుగా పనిచేస్తాయి. చెంచా తేనెలో తాజా అల్లం రసం కలపండి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. 8-10 రోజుల పాటు నిరంతరం తీసుకోవడం వల్ల డస్ట్ అలర్జీ చాలా వరకు తగ్గుతుంది.

ఇది కూడా చదవండి: Maoist: మావోయిస్టుల రివేంజ్.. ఇన్ఫార్మర్లను గొడ్డలితో నరికి చంపి..!

ఇది శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుతుంది. చలికాలంలో డస్ట్ అలర్జీ ఆస్తమా, బ్రోన్కైటిస్, శ్వాసకోశ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. పసుపు, తులసి ఆయుర్వేద కషాయాలను తయారు చేసుకుని తాగితే ప్రయోజనం ఉంటుంది. తులసి ఆకులను మరగబెట్టి అందులో పసుపు వేసి సగం నీరు మిగిలే వరకు కషాయాలను తయారు చేసి గోరువెచ్చగా అయ్యాక ఈ మిశ్రమాన్ని తాగాలి. ఇది శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది. మంటను తగ్గిస్తుంది. అలెర్జీని కలిగి ఉంటే రాత్రి పడుకునే ముందు  ముక్కు,  గొంతు దగ్గర కొబ్బరి నూనెను మసాజ్ చేయాలి. ఇది శ్వాస బాగా ఆడేలా చేస్తుంది.

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి:  పసుపు వల్ల కూడా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయా?

ఇది కూడా చదవండి: Heart Healthy: చలికాలంలో గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పని చేయండి

Advertisment
తాజా కథనాలు