/rtv/media/media_files/2025/03/08/Uy8MQry3EOCEVhcOCg2W.jpg)
WhatsApp group Photograph: (WhatsApp group)
వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించాడని అడ్మిను కిరాతకంగా వెంటాడి చంపేశాడు ఓ వ్యక్తి. ఈ దారుణ ఘటన పాకిస్థాన్‌లోని పెషావర్‌లో మార్చి 7న చోటు చేసుకుంది. ముష్తాక్ అహ్మద్ అనే వ్యక్తి ఓ వాట్సాప్ గ్రూప్‌కు అడ్మిన్‌గా ఉన్నాడు. అష్ఫాక్‌ను వాట్సాప్ గ్రూప్ నుంచి రిమూవ్ చేశాడని కక్ష్య పెంచుకున్నాడు. దాంతోపాటు పాతకక్ష్యల కారణంగా రెగి సఫేద్ సంగ్ ప్రాంతంలో పక్కా ప్లాన్‌తో హత్య చేశాడు. ఈ కేసులో బాధితుడి సోదరుడు హుమాయున్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దర్యాప్తు జరుగుతోంది.
واٹس ایپ گروپ سے کیوں نکالا؟#پشاور کے علاقے ریگی سفید سنگ میں واٹس ایپ گروپ سے نکالنے پر اشفاق اور اسحاق نامی ملزمان نے گروپ ایڈمن مشتاق کو فائرنگ کرکے قتل کردیا۔ پولیس کے مطابق، ملزمان طیش میں آکر ایڈمن پر حملہ آور ہوئے۔#Peshawar #WhatsApp pic.twitter.com/1mT4twC3Vh
— Umar Khattak 🆇 (@iUmarKhattak) March 7, 2025
Also Read:Telangana Crime: కుటుంబ కలహాలతో తల్లిని నరికి చంపిన కొడుకు
బాధితుడి సోదరుడి ప్రకారం.. ముష్తాక్ అహ్మద్ ఓ వాట్సాప్ గ్రూప్‌కు అడ్మిన్‌గా ఉన్నాడు. అతను అష్ఫాక్‌ను ఆ గ్రూప్ నుంచి రిమూవ్ చేశాడు. దీంతో ఆగ్రహించిన సదరు వ్యక్తి అడ్మిన్ దగ్గరికి వెళ్లి వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇది మనసులో పెట్టుకొని ముష్తాక్ అహ్మద్ ను హత్య చేయడానికి ప్లాన్ వేశాడు. మార్చి 7న పెషావర్‌లోని రెగి సఫేద్ సంగ్ ప్రాంతంలో తుపాకితో కాల్చి చంపాడు. వెటపడి మరీ ముష్తాక్ ను గన్‌తో కాల్చి చంపాడు అష్ఫాక్. ఈ విషయంపై పాకిస్థాన్ నెటిజన్లు ఆన్‌లైన్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని గుర్తించినా ఇంకా అరెస్ట్ చేయలేదని ఓ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇలాంటి ఆందోళనకర పరిస్థితుల గురించి పాకిస్థానీలు ఆన్‌లైన్‌లో నిందితుడిపై ఫైర్ అవుతున్నారు. ఇండియాలో కూడా ఇలాంటి హత్య 2023లో జరిగింది. ఢిల్లీ గుర్గావ్‌లో ఒక వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌పై ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపారు. వారిని అతను గ్రూప్ నుండి తొలిగించినందుకే కాల్పులు చేశారు.
Also Read: Trump-Musk-Rubio: ట్రంప్ క్యాబినెట్ మీటింగ్ లో గొడవ పడ్డ మస్క్..రూబియె