/rtv/media/media_files/2025/02/11/NDbNwg9z3srkllFB3ZN0.jpg)
road accident kumabha
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ఏపీ వాసులు మృతిచెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. వీరంతా త్రివేణి సంగమంలో స్నానం చేసి మినీ బస్ లో ఇంటికి తిరిగి వస్తుండగా.. మంగళవారం ఉదయం జబల్‌పుర్ జిల్లా పరిధిలోని షిహోరా ప్రాంతంలో మినీ బస్ ను ట్రక్ ఢీకొంది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్ జిల్లాలోఈ ఘటన జరిగింది.
ఏడుగురు ఘటనా స్థలంలోనే
ఈ విషయాన్ని జబల్‌పుర్ జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ సక్సేనా వెల్లడించారు. ఏడుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరిని మంజు శర్మ (32), మనోజ్ విశ్వకర్మ (42) గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు.
మహా కుంభమేళా నుండి తిరిగి వచ్చే భక్తులు రోడ్డు ప్రమాదాల్లో మరణించడం ఇదే మొదటిది కాదు. సోమవారం తెల్లవారుజామున, మహా కుంభమేళా నుండి తిరిగి వస్తుండగా ఆగ్రాకు చెందిన దంపతుల కారును ట్రక్కును ఢీకొట్టింది, ఈ ప్రమాదంలో దంపతులు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. పోలీసులు ట్రక్కును స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అదేవిధంగా ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో కూడా ఒక ప్రమాదం జరిగింది, ఒడిశాలోని రూర్కెలాకు చెందిన ఒక వ్యక్తి కారు బస్సును ఢీకొట్టడంతో అతను మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ సంఘటనలన్నీ మహా కుంభమేళా నుండి తిరిగి వచ్చే భక్తుల భద్రతపై ప్రశ్నలను లేవనెత్తాయి. మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ఫిబ్రవరి 9 వరకు 44 కోట్లకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో స్నానమాచరించారు.
Also read : ఆ కోతి చేసిన పనికి 11 గంటలు కరెంట్ కట్.. ఆ మంకీ ఏం చేసిందో తెలుసా?