కర్నూల్‌లో త్రీ టౌన్ పోలీసులు అత్యుత్సాహానికి పాల్పడ్డారు. జై భీమ్ సినిమా సీన్‌ని పోలీసులు రిపీట్ చేశారు. ఇద్దరు అనుమానితులను 14 రోజులుగా పోలీస్ స్టేషన్‌లోనే ఉంచి నరకం చూపించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. చేయని తప్పులకు ఒప్పుకోమని ఇద్దరూ పిల్లలను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని బంధువులు ఆరోపించారు. 14 రోజుల నుంచి పిల్లలు కనిపించడం లేదని చివరికి లాయర్లను తల్లిదండ్రులు ఆశ్రయించారు.
ఇది కూడా చూడండి: Mlc Kavitha: ఆసుపత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత!
రంగంలోకి దిగి..
దీంతో జడ్జి సెర్చ్ వారెంట్ ఇవ్వడంతో అడ్వకేట్ జనరల్ రంగంలోకి దిగారు. అనుమానితుల స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసి లాయర్ జడ్జి ముందు పెట్టారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. అమాయకులను చిత్రహింసలకు గురి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూల్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ మురళీధర్ రెడ్డి గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.
ఇది కూడా చూడండి: మహిళను ఈడ్చుకెళ్లి గెంటేసిన విమాన సిబ్బంది.. వైరల్ అవుతున్న వీడియో!