BIG BREAKING: కూకట్‌పల్లి హత్య కేసులో వీడిన మిస్టరీ.. హత్య చేసింది పదో తరగతి విద్యార్థి

కూకట్‌పల్లి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆ బాలికను హత్య చేసింది పదో తరగతి బాలుడు అని పోలీసులు గుర్తించారు. దొంగతనం చేస్తుండగా చూసిందని ఆ బాలుడు బాలికను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. 

New Update
BREAKING NEWS

BREAKING NEWS

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఇటీవల ఓ 12 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురై తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ హత్య కేసులో మిస్టరీ వీడింది. ఎట్టకేలకు పోలీసులు ఈ కేసును ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 12 ఏళ్ల బాలికను హత్య చేసింది పదో తరగతి బాలుడని పోలీసులు గుర్తించారు. అయితే బాలుడు దొంగతనం చేయడానికి వెళ్లగా ఆ బాలిక చూడటం వల్ల చంపేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పదో తరగతి చదువుతున్న ఆ బాలుడు బాలిక ఇంట్లోకి వెళ్లి రూ.80 వేలు దొంగలించాడు. ఈ సమయంలో 12 ఏళ్ల బాలిక చూడటంతో వెంటనే ఆమె పీకపిసికి చంపేశాడు. ఆ తర్వాత చనిపోయిందని కన్ఫార్మ్ చేసుకోవడానికి కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. అయితే దొంగతనం ఎప్పుడు? ఎలా చేయాలి? ఎవరైనా చేస్తే ఏం చేయాలని కూడా ముందే ఆ బాలుడు ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తనకి వచ్చిన ఇంగ్లీషులో దొంగతనం వంటివి ఎలా చేయాలని నెట్ నుంచి వివరాలు సేకరించి వాటిని పేపర్‌పై రాసుకున్నాడు. అయితే ఇక్కడ దొంగతనం చేసిన తర్వాత పక్క బిల్డింగ్‌లో దాదాపుగా 15 నిమిషాల పాటు ఆ బాలుడు దాక్కున్నాడు. ఈ విషయాన్ని ఓ ఐటీ ఉద్యోగి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. 

ఇది కూడా చూడండి: AP Crime: అయ్యో బిడ్డలు.. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ప్రాణం తీసిన ఈత సరదా.. ఎంతమంది చనిపోయారంటే?

ఇది కూడా చూడండి: High Court: చేతులు దులిపేసుకుంటే ఎలా? అందరూ బాధ్యులే.. విద్యుత్‌ మృతులపై తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

కేసు ఏంటంటే?

కూకట్‌పల్లిలో ఓ కుటుంబం ఉంటుంది. వీరికి కొడుకు, కూతురు అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే తండ్రి బైక్ మెకానిక్‌గా పనిచేస్తుండగా, భార్య ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. కొన్నేళ్ల నుంచి వీరు కూకట్‌పల్లిలోనే నివసిస్తున్నారు. అయితే ఓ రోజు ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడంతో ఓ 12 ఏళ్ల బాలిక హత్యకు గురైంది. కొడుకుకు బాక్స్ ఇవ్వడానికి తండ్రి ఇంటికి రావడంతో బెడ్ మీద కత్తిపోట్లతో కూతరు పడి ఉంది. దీంతో తండ్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

అద్దెకు ఉంటున్న యువకుడిపై..
ఆ బాలిక ఇంటి పై పోర్షన్‌లో సంజయ్ అనే యువకుడు అద్దెకు ఉంటున్నాడు. అయితే ఇతని మీద అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తాను హత్య చేయలేదని, తనకేం తెలియని ఆ వ్యక్తి తెలిపాడు. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా చివరకు మిస్టరీ వీడింది.

Advertisment
తాజా కథనాలు