Gold Price: ఇదే మంచి అవకాశం.. భారీగా తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర క్రితం రోజు తులంపై రూ.770 తగ్గగా ఈరోజు మరో 160 తగ్గింది. దీంతో ప్రస్తుతం తులం బంగారం రూ. 80 వేల 400 వద్దకు వచ్చి చేరింది.

New Update
gold,

Gold Prices: బంగారం కొనుగోలు చేసే వారికి ఇదే మంచి అవకాశం. ఎందుకంటే బంగారం ధరలు వరుసపెట్టి తగ్గుతున్నాయి. ధన త్రయోదశి, దీపావళి సందర్భంగా వరుసగా పెరిగిన బంగారం ధరలు పండగ సీజన్ ముగిసిన తర్వాత వరుసగా దిగుతున్నాయి. గిరాకీ తగ్గడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు భారీగా తగ్గడమే ఇందుకు కారణంగా బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

దీపావళి సందర్భంగా బంగారం కొనాలని వెనకడుగు వేసిన వారికి ఇదో సువర్ణావకాశంగా చెప్పవచ్చు. వరుసగా రెండు రోజుల్లోనే బిస్కెట్ బంగారం రేటు తులంపైనే దాదాపు రూ.1000 మేర దిగివచ్చింది. పది తులాలు కొనే వారికి రూ.10 వేలు ఆదా అవుతున్నట్లే లెక్క. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో నవంబర్ 3వ తేదీన బంగారం, వెండి ధరలు ఎంతకు దిగివచ్చాయో తెలుసుకుందాం.

Also Read:  విశ్వమిత్రగా భారత్...విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర క్రితం రోజు తులంపై రూ.770 తగ్గగా ఈరోజు మరో 160 తగ్గింది. దీంతో ప్రస్తుతం తులం బంగారం రూ. 80 వేల 400 వద్దకు వచ్చి చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములపై ఇవాళ రూ.150 తగ్గడంతో రూ. 73 వేల 700 వద్దకు పడిపోయింది. ఇక ఢిల్లీ మార్కెట్లో రేట్లు గమనిస్తే.. 22 క్యారెట్ల గోల్డ్ పది గ్రాముల పై రూ. 200 తగ్గడంతో రూ. 73 వేల 800 వద్దకు దిగివచ్చింది. అలాగే 24 క్యారెట్ల గోల్డ్ ఢిల్లీలో పది గ్రాముల రేటు రూ. 160 తగ్గడం తో రూ. 80 వేల 550 వద్దకు దిగివచ్చింది.

Also Read:  కెనడా ఇక ఆపదా..సైబర్ ముప్పు దేశాల జాబితాలో భారత్ పేరు

స్థిరంగానే వెండి రేట్లు..

బంగారం ధరలు వరుసగా పడిపోతున్నప్పటికీ వెండి రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే, రెండు రోజుల క్రితం కిలో వెండి రేటు హైదరాబాద్ మార్కెట్లో రూ.3000 మేర తగ్గింది. ఇప్పుడు అదే రేటు రూ. 1,06,000 వద్ద స్థిరంగా ఉంది. ఇక ఢిల్లీ మార్కెట్ కిలో వెండి రేటు రూ.97 వేల వద్ద కొనసాగుతోంది.

Also Read: రైలు ఢీకొని నలుగురు పారిశుద్ధ్య కార్మికులు మృతి!

Also Read:  టీజీఆర్టీసీ గుడ్‌ న్యూస్‌..ఆ పుణ్యక్షేత్రాలకు స్పెషల్‌ బస్సులు

Advertisment
Advertisment
తాజా కథనాలు