/rtv/media/media_files/2025/01/19/040EgVOG2UA6C6pPkvo9.jpg)
loan app incident
Khammam: దేశవ్యాప్తంగా లోన్ యాప్ వేధింపుల మరణాలు పెరిగిపోతున్నాయి. రోజుకు ఎవరో ఒకరు ఏదో ఒక చోట ఈ వేధింపుల ధాటికి బలైపోతున్నారు. అవసరానికి డబ్బులు తీసుకొని.. ఆ తరువాత ఆ డబ్బులు కట్టలేక, ఇటు వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా మరో యువకుడు ప్రాణం తీసింది ఈ లోన్ యాప్. తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించడంలో జాప్యం జరగడంతో ఏజెంట్లు ఉన్మాదంగా వేధింపులకు గురిచేశారు. దీంతో ఆ యువకుడు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.
ఫొటోలు మార్ఫింగ్ చేస్తామని బెదిరింపులు..
అయితే భద్రాధ్రికొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రాంతానికి చెందిన లోధ్ సంతోష్ (21) అనే యువకుడు ఓలోన్ యాప్ నుంచి గతంలో రూ.లక్ష రూపాయలు రుణం తీసుకున్నాడు. ఆ తర్వాత రూ. 50 వేల రూపాయలు తిరిగి చెల్లించాడు. ఆర్థిక సమస్యలతో మిగిలిన రుణం చెల్లించలేకపోయాడు. దీంతో లోన్ యాప్ నిర్వాహకులు తీసుకున్న రుణం చెల్లించాల్సిందేనంటూ సంతోష్ కు తరచూ కాల్ చేసి వేధింపులకు గురిచేశారు.
Also Read: Manoj Vs Vishnu: నాన్నను పక్కన పెడదాం.. రా.. మనిద్దరం ఫేస్ 2 ఫేస్ చూసుకుందాం.. విష్ణుకు మనోజ్ సవాల్!
డబ్బు చెల్లించకుంటే సంతోష్ తో పాటు అతడి కుటుంబసభ్యుల ఫొటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తామంటూ బెదిరించారు. ఇటు అప్పు చెల్లించలేక, వేధింపులు తాళలేక తీవ్ర మనోవేదనకు గురైన సంతోష్ శుక్రవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూశాడు సంతోష్.
Also Read: COURT: నాని నుంచి అదిరిపోయే కోర్ట్ డ్రామా.. రిలీజ్ డేట్ వచ్చేసింది!