COURT: నాని నుంచి అదిరిపోయే కోర్ట్ డ్రామా.. రిలీజ్ డేట్ వచ్చేసింది!

నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ 'కోర్టు'. అయితే తాజాగా ఈమూవీ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఉగాది కానుక‌గా మార్చి 14న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం తెలిపింది.

New Update

రిలీజ్ డేట్ 

అయితే  తాజాగా మేకర్స్ ఈమూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఉగాది కానుకగా మార్చి 14న విడుదల కానున్నట్లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా సినిమాకు సంబంధించిన ఓ స్పెష‌ల్ వీడియోను కూడా  పంచుకున్నారు. ”నువ్వు మరీ నేను అనుకున్నంత ఎదవవేమీ కాదు. అంటే ఎంతో కొంత ఎదవనే అంటావు. ఏ కాదా.. స‌ర్లే నేను వెళ్లాలి. హలో హలో.. నీ పేరు ఏంటి? జాబిలి.. మ‌రి నీ పేరు.. అనగానే  కేసు నెంబర్ 16 2013 అంటూ  బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో వీడియో ఇంట్రెస్టింగ్ గా కనిపంచింది. ఓ యువకుడిని అన్యాయంగా కేసులో నిందితుడిగా చేసిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రియదర్శి లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. 

Also Read: Manoj Vs Vishnu: నాన్నను పక్కన పెడదాం.. రా.. మనిద్దరం ఫేస్ 2 ఫేస్ చూసుకుందాం.. విష్ణుకు మనోజ్ సవాల్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు