/rtv/media/media_files/2025/04/29/G3dNs4XQU8hAij9EDQyA.jpg)
Khammam gas cylinder incident
Khammam ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకై ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడం, నలుగురు పసివాళ్లు తీవ్ర గాయాలపాలైన విషాదకర ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో గుత్తికొండ వినోద్ అనే వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలు, తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే వేసవి సెలవులు కావడంతో అతడి చెల్లెలు కుమార్తెలు ప్రిన్సి, లింసీ కూడా మేనమామ ఇంటికి వచ్చారు. నలుగురి పిల్లలతో కలిసి అందరూ సంతోషంగా వేసవి సెలవులు గడుపుతున్నారు. ఈ క్రమంలో ఊహించని సంఘటన వారి జీవితాలను చీకటిలోకి నెట్టేసింది.
గ్యాస్ లీకై..
అయితే మంగళవారం సాయంత్రం ఇంట్లో గ్యాస్ అయిపోవడంతో.. అది గమనించిన వినోద్ మరొక గ్యాస్ సిలిండర్ ని బిగిస్తున్నాడు. ఈ సమయంలో ఒక్కసారిగా లీకై మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న బట్టలకు మంటలు అంటుకోవడంతో మంటల తీవ్రత మరింత పెరిగింది.
ఇద్దరు మృతి
ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న వినోద్ తో సహా ఆయన తల్లి సుశీల, నలుగురు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు అంబులెన్స్ కి కాల్ చేసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించడంతో వినోద్ చిన్నకుమారుడు తరుణ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. తల్లి సుశీల కూడా ప్రాణాలు కోల్పోయింది. చెల్లెలి కుమార్తె లింసీ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగినప్పుడు పిల్లలు అప్పడే స్నానం చేసి ఇంట్లోకి వచ్చారని.. ఇంతలోనే గ్యాస్ లీకై మంటలు చెలరేగి అందులో చిక్కుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ సమయంలో వినోద్ భార్య రేవతి సరుకులు కొనడానికి దుకాణానికి వెళ్లడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ సంఘటనతో మిట్టపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
latest-news | telugu-news | Gas Cylinder Incident | latest news telugu
Also Read: 70 ఏళ్ల అమ్మమ్మ చీరలో ముస్తాబైన హీరోయిన్.. ఎంత అందంగా ఉందో! ఫొటోలు చూస్తే అంతే