Muharram Celebration: ఘోర విషాదం.. అగ్నిగుండంలో పడి కాలిపోయాడు!

కర్ణాటకలోని రాయచూర్ జిల్లా యరగుంటి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మొహర్రం ఊరేగింపు వేడుకల కోసం ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో పడి 40 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆసుపత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అతడిని హనుమంతుగా గుర్తించారు.

New Update
Karnataka man died after falling into a fire pit

Karnataka man died after falling into a fire pit

మొహర్రం ఊరేగింపు వేడుకల కోసం ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో పడి 40 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన కర్ణాటకలోని రాయచూర్ జిల్లా యరగుంటి గ్రామంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: రోజూ ఆయన కొట్టేవాడు..ఈరోజు నేను కొట్టా..ఒక దెబ్బకే పోయాడు...భార్య సంచలనం

అగ్నిగుండంలో పడి మృతి

రాయచూర్ జిల్లా యరగుంటి గ్రామంలో మొహర్రం ఊరేగింపు వేడుకలను జరుపుకోవడానికి అగ్నిగుండం సిద్ధం చేశారు. అందులో పరిగెడుతుండగా హనుమంత్ అనే 40 ఏళ్ల వ్యక్తి పడిపోయాడు. తీవ్రంగా కాలిపోయిన హనుమంత్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న లింగ్సుగూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

Also Read: పోలీసులనే మోసం చేసిన యువతి.. యూనిఫాంలో ట్రైనింగ్ చేస్తూ

హనుమంత్ అగ్నిగుండంలో ఎలా పడిపోయాడనేది ఇంకా తెలియలేదు. ఇది ప్రమాదమా? లేక కుట్రనా? అని తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో హనుమంత్ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు