/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Death-jpg.webp)
ksrtc incident
Karnataka Incident: వాంతు చేసుకునేందుకు ఓ మహిళ బస్సు కిటీకీలో నుంచి తల బయటకు పెట్టింది. కట్ చేస్తే.. తల తెగి రోడ్డుపై పడిపోయింది. తలతోపాటు ఆమె కుడిచేయి కూడా తెగి పడింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని మైసూర్ లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: పోలీసులకు ఊహించని షాక్.. సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్!
నలిగిపోయిన తల
బేగూరు మండలం ఆలహళ్లి గ్రామానికి చెందిన శివలింగమ్మ (58) అనే మహిళా కర్ణాటక ఆర్టీసీ బస్సులో కుడి వైపు సీట్లో కూర్చుంది. అయితే ఆమె బస్సు వెళ్తుండగా వాంతి చేసుకోవడానికి కిటికీలో నుంచి తల బయటకు పెట్టింది. ఇంతలో బస్సు వెనకాలే వస్తున్న టిప్పర్ లారీ బస్సును రాసుకుంటూ దూసుకెళ్లింది. ఈ క్రమంలో మహిళ తలతో పాటు కుడి చేయి బస్సు, లారీ మధ్యలో నలిగిపోయి.. తెగి రోడ్డుపై పడ్డాయి. దీంతో బస్సులోని ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయాందోళనలతో అరుపులు, కేకలు వేశారు. ప్రమాదం తర్వాత టిప్పర్ డ్రైవర్ వాహనంతో సహా పారిపోయాడు. శనివారం మధ్యాహ్నం మైసూరు నుంచి గుండ్లుపేటెకు నంజనగూడు మీదుగా వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సులోని మరో ప్రయాణికురాలి కుడి చేతి కూడా ఫ్రాక్చర్ అయ్యింది. మృతురాలి కుమారుడు ఫిర్యాదు మేరకు నంజనగూడు పోలీసులు ఎఫైఆర్ నమోదు చేశారు.
Karnataka | A female passenger travelling from Mysuru to Gundlupet while attempting to vomit, leaned her head out of the window. At the same time, a tanker lorry approaching from the opposite direction struck her head. The female passenger died on the spot. Officials, including…
— ANI (@ANI) January 25, 2025
Also Read: Balakrishna Padma Bhushan: బాలయ్య బాబుకు అభినందనల వెల్లువ.. ఎవరెవరు విష్ చేశారంటే?