BREAKING: అయ్యో ప్రాణం తీసిన గుడ్డు.. గొంతులో కోడిగుడ్డు ఇరుక్కుని వ్యక్తి మృతి

కాంచీపురం జిల్లా ఉత్తిరమేరూర్‌ పంచాయతీ యూనియన్‌ మలైయాంగుళం గ్రామానికి చెందిన రవి(55) ఉడికించిన కోడి గుడ్డు మింగడంతో నోటిలో ఇరుక్కుంది. ఊపిరాడక మృతి చెందాడు. రవి మృతితో కుటంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

New Update
Crime news

Crime news

ఎవరు ఎప్పుడు చనిపోతారనే విషయం తెలియదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఏదో ఒక ప్రమాదం జరుగుతోంది. ఇటీవల అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో కూడా ఇలానే ఎందరో మరణించారు. ఫ్లైట్‌లో ఉన్నవారే కాకుండా కాలేజీ క్యాంటీన్‌లో భోజనం చేస్తున్నవారు కూడా మృతి చెందారు. ఇలానే ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. అప్పటి వరకు ఆడుతూ ఎంతో సంతోషంగా ఉంటారు. ఇంతలోనే గుండె పోటుతో మృతి చెందుతున్న వారి సంఖ్య కూడా ఈ రోజుల్లో పెరిగిపోతుంది.

ఇది కూడా చూడండి: AP Crime: ఆర్కే బీచ్‌లో విషాదం.. అలల తాకిడికి ఓ కుటుంబం...

కోడిగుడ్డు మింగేయడంతో..

ఇటీవల ఓ వ్యక్తి గుడ్డు తింటూ నోటిలో ఇరుక్కుని మృతి చెందిన ఘటన కాంచీపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాంచీపురం జిల్లా ఉత్తిరమేరూర్‌ పంచాయతీ యూనియన్‌ మలైయాంగుళం గ్రామానికి చెందిన రవి(55) అనే వ్యక్తి భవన నిర్మాణ కార్మికుడుగా పనిచేస్తుంటాడు. ఇతనికి భార్య వలర్మతి(45), కుమార్తె స్నేహ(24) కూడా ఉన్నారు. అయితే రవి రాత్రి సమయం ఇంటి దగ్గర భోజనం చేస్తున్నాడు. ఈ సమయంలో ఉడకబెట్టిన కోడిగుడ్డు మింగేశాడు. దీంతో గుడ్డు గొంతులో చిక్కుకుపోవడంతో రవి ఊపిరాడక మృతి చెందాడు. కోడి గుడ్డు మింగేసి రవి చనిపోవడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. 

ఇది కూడా చూడండి: పండగపూట ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు ప్రైవేట్ బస్సుల్లో 18 మంది

నేటి కాలంలో దారుణాలు పెరిగిపోతున్నాయి. మహిళలను కిడ్నాప్ చేసి అతి కిరాతంగా చంపుతున్నారు. ఇలాంటి ఘటన తాజాగా ఏపీలోని అనకాపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సబ్బవరం మండలంలోని బంజరి వద్ద గర్భవతిని గుర్తు తెలియని కొందరు దుండగులు హత్య చేసి ఆ పై కాల్చి వేసి శవాన్ని పడేశారు. సంఘటనా స్థలాన్ని అనకాపల్లి జిల్లా పోలీస్ సూపర్డెంట్ తుహిన్ సిన్హా పరిశీలించారు. సంఘటన స్థలంలో డాగ్ స్క్వెడ్, క్లూస్ టీం తనిఖీలు చేపట్టారు. మృతి చెందిన గర్భిణి వయస్సు 32 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు గుర్తించారు. ఆమెకి తెలిసిన వారే ఇలా చేశారని, వాటి ఆనవాళ్లు కూడా లభించాయని పోలీసుల దర్యాప్తులో తేలింది. గర్భిణి అని చూడకుండా అతి క్రూరంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గర్భిణి భర్త లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా ఇలా చేశారా? లేకపోతే బయట వారు ఇలా చేశారా? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఈ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులను అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

Advertisment
తాజా కథనాలు