/rtv/media/media_files/2025/09/18/dps-2025-09-18-11-09-15.jpg)
నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో దారుణం జరిగింది. సరదా కోసం చేసే పనులు శ్రుతిమించితే ఎంతటి అనర్థాలకు దారితీస్తాయో చెప్పేందుకు ఈ ఘటనే ఊదహరణ అని చెప్పవచ్చు. బర్త్ డే బంప్స్ పేరిట తోటి విద్యార్థుల అనుచిత ప్రవర్తన వల్ల ఓ బాలుడు ఆసుపత్రి పాలయ్యాడు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్తపేట న్యూమారుతీనగర్‌లో ఉంటున్న విద్యార్థి నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. బర్త్ డే సందర్భంగా స్కూల్ కు వెళ్లిన అతడు.. స్నేహితులతో కలిసి బర్త్‌డే బంప్స్ అనే ఆట ఆడారు.
నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పై కేసు నమోదు
— TNews Telugu (@TNewsTelugu) September 17, 2025
117(2),r/w 3(5) BNS కింద కేసు నమోదు చేసిన నాచారం పోలీసులు
గత నెల 29న 10వ తరగతి విద్యార్థి బుర్ర రిశాంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
బర్త్ డే బంప్స్ పేరుతో విద్యార్థి ప్రైవేట్ పార్ట్స్ పై తన్నిన తోటి విద్యార్థులు
ప్రైవేట్ పార్ట్స్… pic.twitter.com/6WUYwIxzd6
ప్రైవేటు భాగాలను మోకాలితో
అయితే ఆటలో భాగంగా... ఆ ఆటలో ఓ విద్యార్థి అతడి ప్రైవేటు భాగాలను మోకాలితో బలంగా కొట్టాడు. దీంతో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. వృషణాలు ఉబ్బిపోయి.. బ్లీడింగ్ కూడా అయింది, వెంటనే ఆ బాలుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి చేరుకున్న తల్లిదండ్రులు, తమ బిడ్డను మెరగైన వైద్యం కోసం బంజారహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
అక్కడ పరీక్షలు చేసిన డాక్టర్లు బాలుడికి మూడు నెలల పాటు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు. వృషణాలకు ఆపరేషన్ చేయడం వల్ల బాలుడికి ప్రాణాపాయం తప్పిందని నాచారం పోలీసులు పేర్కొన్నారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బాధ్యులైన విద్యార్థులు, పాఠశాల యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read : PM Kisan : దీపావళికి ముందే పీఎం కిసాన్ పైసలు.. డేట్ ఇదే!