ప్రస్తుతం రోజుల్లో యువకులు శ్రద్ధగా చదువుకోకుండా మద్యం, గంజాయి, సిగరెట్ వంటి వాటికి అలవాటు పడుతున్నారు. ఇంట్లో, బయట భయం లేకపోవడం వల్ల చెడు అలవాట్లకు ఎక్కువగా బానిస అవుతున్నారు. ఇంజినీరింగ్ చదువుతున్న ఓ యువకుడు ఇటీవల గంజాయి విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.
ఇది కూడా చూడండి: AP: ఏపీ నుంచి మరో కొత్త వందేభారత్ స్లీపర్ రైలు..ఏ రూట్లో అంటే!
తండ్రి మరణించడంతో..
వివరాల్లోకి వెళ్తే.. మిర్యాలగూడలోని శాంతినగర్‌కు చెందిన సిరికొండ భానుప్రకాష్ ఇంజినీరింగ్ చేశారు. ఎనిమిదేళ్ల క్రితం తన తండ్రి మరణించడంతో అప్పటి నుంచి చెడు అలవాట్లకు బానిసయ్యాడు. కాలేజీ చదివే సయమంలో పరిచయమైన అఖిల్ అలియాస్ సోను, డేంజర్ రాఘవతో కలిసి భానుప్రకాష్ గంజాయి అమ్మడం మొదలు పెట్టాడు.
ఇది కూడా చూడండి: Ap Rains: ఏపీని వదలని వరుణుడు..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
తక్కువగా గంజాయిని కొనుగోలు చేసి కాస్త ఎక్కువ రేటుకి కాలేజీలు, విద్యార్థులు ఉండే హాస్టళ్లలో అమ్మేవాడు. కేజీ గంజాయిని రూ.10లకి కొనుగోలు చేసి రూ.25 వేలకు విక్రయించేవాడు. అయితే తాజాగా హైదరాబాద్‌లోని కొన్ని కాలేజీల దగ్గర గంజాయి అమ్మి వస్తుండగా పోలీసులు భానుని అదుపులోకి తీసుకున్నారు. నిందుతుడి దగ్గర నుంచి రూ.2వేలు, 1300 గ్రాముల గంజాయి, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వెంటనే ఆ యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాపతు చేపట్టారు.
ఇది కూడా చూడండి: Holidays: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త..ఏకంగా 15 రోజుల పాటుసెలవులు
ఇది కూడా చూడండి: సౌత్‌ఇండియన్స్ వద్దంటూ జాబ్ నోటిఫికేషన్..తిట్టిపోస్తున్న నెటిజన్లు