హైదరాబాద్ సైబర్ పోలీసులు అలర్ట్ జారీ చేశారు. కొన్ని ఇంటర్నేషనల్ కాల్స్ వచ్చినప్పుడు వాటి లిఫ్ట్ చేస్తే.. సైబర్ క్రిమినల్స్ మీ ఫోన్ హ్యాక్ చేస్తారని హెచ్చరిక విడుదల చేశారు. +94777 455913, +37127913091, +56322553736, +37052529259, +255901130460 ఇలాంటి నంబరుతో ఫోన్ కాల్ వస్తే వెంటనే అప్రమత్తం అవ్వడని సైబర్ పోలీసులు చెప్తున్నారు. ఆ కాల్స్ లిఫ్ట్ చేయవద్దని వారు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి : డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.1.17 లక్షల జీతం!
Also Read: టీడీపీ గూటికి ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి..!
విదేశాల్లో నుంచి సైబర్ నేరగాళ్లు ఈ నెంబర్లతో ఫోన్ చేసి మొబైల్ లోని సెన్సిటీవ్ డేటాని ట్రాక్ చేసే ప్రమాదం ఉంది. ఈ నెంబర్ల నుంచి రింగ్ ఇచ్చి.. కాల్ ఎత్తగానే కట్ చేస్తారట. తిరిగి ఫోన్ చేస్తే మన ఫోన్ లో ఉన్న మొబైల్ నెంబర్స్, బ్యాంకు, క్రెడిట్ కార్డు వంటి వివరాలు క్షణాల వ్యవధిలోనే కాపీ చేసుకుంటారట. తర్వత అకౌంట్లో డబ్బులు మాయం చేస్తారు. ఇండియా లోకల్ నెంబర్స్ అయితే +91తో మాత్రమే వస్తాయి.
కాల్ లిఫ్ట్ చేశాక చివరి అంకె 9 లేదా 90 నొక్కమని అడిగే పొరపాటున కూడా వాటిని క్లిక్ చేయవద్దని చెప్తున్నారు. అలా క్లిక్ చేస్తే మీ మొబైల్ ఉన్న సిమ్ కార్డ్ సైబర్ క్రిమనల్స్ యాక్సిస్ చేస్తారని హెచ్చరిస్తున్నారు.