pawan kalyan: హరిహర వీరమల్లు సినిమాను బాయ్ కట్ చేసుకోండి..  పవన్ సంచలన స్టేట్మెంట్!

హరిహర వీరమల్లు సినిమాను బాయ్ కట్ చేస్తామని కొంతమంది హెచ్చరించారని..  బాయ్ కట్ చేస్తే తనకు పోయేది ఏం లేదన్నారు పవన్.  ఇదేమైనా క్విట్ ఇండియా ఉద్యమమా అని ప్రశ్నించారు.

New Update
pawan-kalyan

హరిహర వీరమల్లు సినిమాను బాయ్ కట్ చేస్తామని కొంతమంది హెచ్చరించారని..  బాయ్ కట్ చేస్తే తనకు పోయేది ఏం లేదన్నారు పవన్.  ఇదేమైనా క్విట్ ఇండియా ఉద్యమమా అని ప్రశ్నించారు. ఏం చేస్తారో చేసుకోండి అని సమాధానం ఇచ్చానని తెలిపారు. నెల్లూరులో చిన్న వీధుల్లో పెరిగిన తాను ఇక్కడిదాకా రావడమే  గొప్ప అని అన్నారు. తన సినిమాను అపుతామని బెదిరిస్తున్నారంటే తాను ఎంతస్థాయికి వచ్చానో వాళ్లే చెబుతున్నారని పవన్ అన్నారు.  జీవితంలో ఎన్నో దెబ్బలు చూశానని ఇలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు.  హైదరాబాద్ లో జరిగిన హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ మీట్ లో పవన్ పాల్గొని మాట్లాడారు.

అభిమానులు  ఇచ్చే దైర్యం వల్లే

అభిమానులు  ఇచ్చే దైర్యం వల్లే తాను ఇంతలా ఎదిగనన్నారు.  డిప్రెషన్ ఎంటో తనకు తెలియదన్నారు. మనం బలంగా ఉన్నామంటే నెగిటివ్ గా మాట్లాడుతారని అభిమానులకు తెలిపారు.  ఈ ప్రెస్ మీట్‌లో చిత్ర విజయం పట్ల పవన్ ఆనందం వ్యక్తం చేశారు. సాధారణంగా తనకు సినిమా ప్రమోషన్లలో పెద్దగా పాల్గొనని..   కానీ ఈ చిత్రానికి ఎందుకు ప్రమోషన్లు చేశాననే  దానిపై స్పష్టత ఇచ్చారు. కాగా హరిహర వీరమల్లు  ప్రీమియర్ షోల నుండి మంచి వసూళ్లను రాబట్టింది.  పాజిటివ్ టాక్‌తో ముందుకు సాగుతోంది. మొదటి రోజు రూ. 50 కోట్ల పైగా వసూలు చేసినట్లు అంచనా. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ఈ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. 

Advertisment
తాజా కథనాలు