Crime: ప్రియురాళ్లకోసం ఘోరం.. భార్యకు మత్తు మందు ఎక్కించి దారుణం!

ప్రియురాళ్ల మోజులో కట్టుకున్న భార్యకు మత్తు మందు ఇచ్చి చంపిన ఘటన ఒడిశా భువనేశ్వర్‌లో జరిగింది. నిందితుడు ప్రద్యుమ్న కుమార్‌, అతని గర్ల్ ఫ్రెండ్స్ ఇజిత భూయాన్‌, రోజీ అనే నర్సులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

crime,
New Update

Crime: కట్టుకున్నవాడు కామాంధుడని తెలియక ఓ మహిళా దారుణంగా మోసపోయింది. తాను ఉండగానే ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని తనను వేధించిన భరించింది. అయినా బుద్ధి మార్చుకోని భర్త.. అదే పనిగా ఇద్దరు మహిళలతో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుని టార్చర్ చేయడం మొదలుపెట్టాడు. ప్రశ్నించిన భార్యపై తరచు దాడికి పాల్పడగా.. ఆమె తిరగబడింది. భర్త ప్రియురాళ్లను నిలదీసింది. దీంతో ఆమె అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసిన భర్త ప్రియురాళ్లు.. చివరికి ఆ అమాయకురాలిని అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరగగా వివరాలు ఇలా ఉన్నాయి. 

ఇది కూడా చదవండి: VIRAT: కోహ్లీకి కెప్టెన్ బాధ్యతలు.. గెలుపే లక్ష్యంగా కోచ్ కీలక నిర్ణయం

ప్రేమించి పెళ్లి చేసుకుని.. 

ఫార్మసిస్టుగా పనిచేస్తున్న ప్రద్యుమ్న కుమార్‌కు 2020లో శుభశ్రీ అనే మహిళతో పెళ్లైంది. అయితే వీరిద్దరూ కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉండగా.. పెళ్లి తర్వాత భార్యను టార్చర్‌ చేయడం మొదలుపెట్టాడు. దీంతో ఆరు నెలల క్రితం శుభశ్రీ తన పుట్టింటికి వెళ్లింది. దీంతో ఇజిత భూయాన్‌, రోజీ అనే నర్సులతో కుమార్ కు పరిచయం ఏర్పడగా కొన్నాళ్లకు అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే శుభశ్రీని హత్య చేయాలని కుట్ర పన్నారు. అక్టోబర్‌ 27న ఆమెను సాంపుర్‌లోని రోజీ ఇంటికి తీసుకొచ్చిన కుమార్.. బలవంతంగా అధిక మోతాదులో మత్తుమందు ఎక్కించారు. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆస్పత్రికి తీసుకెళ్లి ఆత్మహత్యకు ప్రయత్నించిందని చెప్పాడు. ఆమె మృతిచెందిన తర్వాత మృతదేహానికి పోస్టుమార్టం చేయడంతో దారుణం బయటపడింది. 

ఇది కూడా చదవండి: ఫేస్ బుక్ లో మెసేజ్, మూడు వారాల్లోనే పెళ్లి.. దుల్కర్ లవ్ స్టోరీ తెలిస్తే షాక్


అనస్థీషియా డ్రగ్స్‌ ఎక్కించి..

అధిక మోతాదులో అనస్థీషియా డ్రగ్స్‌ ఎక్కించడంతో ఇది కేవలం అసహజ మరణం మాత్రమే కాదు.. దీని వెనుక కుట్ర ఉందని అనుమానించారు డీసీపీ. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. నిందితుడిని, అతని ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్‌ను అరెస్టు చేశారు. 

#murder #wife #odisa #husbend
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe