/rtv/media/media_files/2024/10/31/sX3kZ65C9Z7WodeDRSxq.jpg)
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్నటాక్ షో ‘అన్‌స్టాపబుల్ సీజన్ 4’. ఆహా ఓటీటీ వేదికగా ఇది స్ట్రీమింగ్ అవుతోంది.ఫస్ట్ ఎపిసోడ్ కు ఏపీ సీఎం చంద్రబాబు హాజరవ్వగా.. సెకెండ్ ఎపిసోడ్ లో ‘లక్కీ భాస్కర్’ టీమ్ సందడి చేసింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ కార్యక్రమంలో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, వెంకీ అట్లూరి, నాగవంశీ పాల్గొన్నారు.
దీనికి సంబంధించిన ఎపిసోడ్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. ఇందులో దుల్కర్ సల్మాన్ సినిమా విశేషాలతోపాటు తన కెరీర్ గురించి దుల్కర్ సల్మాన్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఇందులో భాగంగానే బాలయ్య.. దుల్కర్ ను 'మీ ప్రేమకథ ఎలా మొదలైంది?' అని అడిగారు. దానికి దుల్కర్ బదులిస్తూ..' తను నా జూనియర్. నేను 12th చదువుతున్నప్పుడు తను ఎనిమిదో తరగతి. అప్పట్లో సరిగ్గా పరిచయం లేదు.
Manam 200 ayithe mee vadu 300 anta 🔥🔥
— ahavideoin (@ahavideoIN) October 29, 2024
Watch Promo ▶️https://t.co/uGT9Pu4EIN#Unstoppables4 with NBK Season 4, Episode 2 premieres on Oct 31, 7:00 PM.#NandamuriBalakrishna #JaiBalayya @dulQuer @Meenakshiioffl
#DulqarSaalman #MeenakshiiChaudhary #balayyapanduga pic.twitter.com/S9aJLKYltH
Also Read : మీనాక్షి చౌదరి సినిమాల్లోకి రాకముందు ఏం చేసేదో తెలుసా?
13 ఏళ్ల అనుబంధం..
అప్పుడప్పుడు బయట చూస్తుండేవాడిని అంతే. చదువు పూర్తయిన అనంతరం చాన్నాళ్లకు వాళ్లింట్లోవాళ్లు అబ్బాయి కోసం వెతికారు. అదే సమయంలో నాక్కూడా సంబంధాలు చూస్తున్నారు. ఫేస్‌బుక్‌లో ఆమెకు సందేశం పంపించా. మనం ఒక్కసారి కలుద్దామని అడిగా. మూడు వారాల్లోనే మాకు నిశ్చితార్థం జరిగింది. 13ఏళ్ల అనుబంధం మాది..' అంటూ తన లవ్ స్టోరీ గురించి చెప్పారు.
Also Read : 'పుష్ప 2' లో బిగ్ సర్ప్రైజ్.. ఫ్యాన్స్ కు పండగే