మరో మహిళతో ప్రియుడు శృంగారం.. కసితీరా కోసేసిన యువతి!

ప్రియుడు మోసం చేస్తున్నాడని తెలిసి ఓ యువతి దారుణానికి పాల్పడింది. మరో యువతితో పెళ్లికి సిద్ధం అయ్యాడని తెలియగానే తట్టుకోలేకపోయింది. తనకు దక్కనివాడు ఇంకెవరికీ దక్కకూడదని, చివరిసారి కలుద్దామని పిలిచి అతని పురుషాంగం కోసేసింది. ఈ ఘటన యూపీలో జరిగింది.  

author-image
By srinivas
New Update
love effair

love effair case

Crime: తన ప్రియుడు మరో మహిళతో సన్నిహితంగా ఉండటం తట్టుకోలేక ఓ యువతి దారుణానికి పాల్పడింది. ఎంతో ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు దూరమవుతున్నాడనే బాధతోపాటు కేవలం శృంగారం కోసం మరో స్త్రీ మోజులో పడి తనను కాదన్నాడనే కోపంతో రగిలిపోయింది. అంతేకాదు తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి కొంతకాలం తిరిగిన యువకుడు.. మరో అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసేందుకు సిద్ధం కావడంతో తట్టుకోలేక అమ్మోరు అవతారమెత్తింది. తనకు దక్కని వాడు ఇంకెవరికి దక్కడానికి వీళ్లేదని భావించిన ఆమె ఏకంగా అతన్ని సంసారానికి పనికిరాకుండా చేసింది. ఈ దారుణమైన ఘటన యూపీలో చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి.   

చివరిసారి కలుద్దామని నమ్మించి..

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్న ఓ యువ జంట.. అనుకోకుండా కొన్ని రోజులు దూరమైంది. ఈ క్రమంలో ప్రియుడు మరో యువతితో సన్నిహితంగా ఉంటూ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం స్నేహితుల ద్వారా ప్రియురాలికి తెలిసింది. దీంతో పగతో రగిలిపోయిన ఆమె.. చివరిసారి కలుద్దామంటూ అతన్ని నమ్మించి ఓచోటుకు పిలిచింది. ఒకసారి ఏకాంతంగా గడపాలని ఉందంటూ రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి పెళ్లి గురించి ఆరాతీసింది. 

ఇది కూడా చదవండి: Allu Arjun: అల్లు అర్జున్ కొంపముంచిన ప్రెస్ మీట్.. ఆ ఒక్క మాటతో..!

ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో తన వెంట తెచ్చిన కత్తితో ప్రియుడి ప్రైవేట్‌ పార్ట్ కోసేసింది. ఆ తర్వాత తన చేతిని కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. అప్పటికే రక్తం మడుగులో ఉన్న ప్రియుడు.. తనకు కట్టుకట్టుకుని, ఆమెకు కట్టు కట్టి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరకున్న పోలీసులు ఇద్దరినీ హాస్పిటల్‌కు తరలించగా అతడు చికిత్స పొందుతున్నారు. ఆమెకు చికిత్స అందించి అరెస్టు చేశారు. పోలీసులతో కలిసి యువతి హాస్పిటల్ నుంచి బయటకొస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు