Fire accident: ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. అందులోనే 15 మంది కార్మికులు

ఉత్తరప్రదేశ్ నోయిడాలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు ఎగిసిపడ్డాయి. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న 15 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు.

New Update
Uttarpradesh Noida Fire accident

Uttarpradesh Noida Fire accident Photograph: (Uttarpradesh Noida Fire accident )

పరిశ్రమలో పేలుడు సంభవించి మంటలు వ్యాపించాయి. ఉత్తరప్రదేశ్‌ నోయిడాలో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆకాశంలోకి దట్టమైన పొగలు ఎగిసిపడ్డాయి. అగ్ని ప్రమాదం సమయంలో ఫ్యాక్టరీలో 15 మంది కార్మికులు ఉన్నారు. ఇటీవల సెక్టార్‌ 63లోని గార్మెంట్‌ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం ఘటనను మరువకముందే ఈరోజు సూరజ్‌పూర్‌ లోని ఓ ప్లాస్టిక్‌ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పివేశారు. కానీ నల్లని దట్టమైన పొగలు ఇంకా వెలువడుతూనే ఉన్నాయి. కంపెనీ లోపల చిక్కుకున్నారని 15 మంది కార్మికులను సురక్షితంగా కాపాడారు. ఇప్పటివరకు మాత్రం ఈ ఘటనలో ప్రాణ నష్టంగానీ, ఎవరైనా గాయపడటం కానీ జరగలేదని స్థానికులు చెబుతున్నారు. ఫ్యాక్టరీని నుంచి మంటలు, దట్టమైన పొగలు ఎగిసిపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు