Fire Accident: వృద్దాశ్రమంలో ఘోర అగ్ని ప్రమాదం.. 9 మంది స్పాట్ డెడ్ !

అమెరికా , మసాచుసెట్స్‌లోని ఫాల్ రివర్‌‌‌‌ లో ఉన్న గాబ్రియేల్ హౌస్ వృద్దాశ్రమంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మంది చనిపోగా.. మరో 30 మందికి గాయాలయ్యాయి.

New Update
Mount Selinda Orphanage fire accident

Mount Selinda Orphanage fire accident

Fire Accident:  అమెరికా , మసాచుసెట్స్‌లోని ఫాల్ రివర్‌‌‌‌ లో ఉన్న గాబ్రియేల్ హౌస్  వృద్దాశ్రమంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మంది చనిపోగా.. మరో 30 మందికి గాయాలయ్యాయి. భవనమంతా మంటలు చుట్టుముట్టడంతో.. ముసలివాళ్ళు  కిటికీలకు వేలాడుతూ సహాయం కోసం కేకలు వేస్తున్నారు. రాత్రి 9.50 నిమిషాల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. దాదాపు 50 మంది అగ్నిమాపక సిబ్బంది వచ్చారు. 

Also Read: Hari Hara VeeraMallu: పవన్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా.. 'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే!

Famous Celebrity Divorces:సైనా నెహ్వాల్, ఏఆర్ రెహమాన్, జయం రవితో పాటు.. ఇటీవల విడాకులు తీసుకున్న ప్రముఖులు వీరే!

దాదాపు 70 మంది

అప్పటికే భవనం నుంచి భారీ పొగ, మంటలు ఎగసిపడుతున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర అగ్నిమాపక యంత్రాంగం తెలిపిన వివరాల ప్రకారం.. మంటలు చెలరేగిన సమయంలో దాదాపు 70 మంది నివాసితులు ఆ భవనం లోపల చిక్కుకుపోయినట్లు తెలిపారు. అలాగే చిక్కుకుపోయిన వారిని రక్షించే క్రమంలో ఐదుగురు అగ్నిమాపక సిబ్బంది గాయపడినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఫాల్ రివర్ పోలీసులు అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read: Kota Srinivasa Rao: ఆ సూపర్ హిట్ పాట పాడింది 'కోట' నే.. ఈ విషయం మీకు తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు