Hari Hara VeeraMallu: దాదాపు మూడేళ్ళుగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' ఈనెల 24న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ స్థాయిలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈనెల 20న విశాఖపట్నం వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య ముఖ్య అతిథులుగా హాజరు కానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. అలాగే 2:42 నిమిషాలు రన్ టైం ఖరారైంది.
#HariHaraVeeraMallu completed censor formalities & received U/A certificate.
— JSP Naresh (@JspBVMNaresh) July 14, 2025
Makers are planning a grand pre-release event on July 20, 2025 in Vizag 🔥🔥🔥 pic.twitter.com/LOzSPyw3Ip
హిస్టారికల్ బ్యాక్ డ్రాప్
హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రానికి జ్యోతికృష్ణ దర్శకత్వం వహించాడు. ముందుగా డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించగా.. పలు కారణాల చేత ఆయన తప్పుకున్నాడు. ఆ తర్వాత జ్యోతికృష్ణ టేకోవర్ చేశాడు. పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో చాలా ఆలస్యమైన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సూపర్ బజ్ క్రియేట్ చేశారు.
ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా.. నోరా ఫతేహీ, నర్గీస్ ఫక్రీ, సత్యరాజ్, సుబ్బరాజ్, బాబీ డియోల్, పూజిత పొన్నాడ, సునీల్, నాజర్, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏఎం. రత్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆస్కార్ విజేత ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు.
Famous Celebrity Divorces:సైనా నెహ్వాల్, ఏఆర్ రెహమాన్, జయం రవితో పాటు.. ఇటీవల విడాకులు తీసుకున్న ప్రముఖులు వీరే!