మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ధారావతు తండాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ధారావతు రవి అనే రైతు గత కొన్ని రోజుల నుంచి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. దీనికి తోడు రుణమాఫీ కాలేదని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. రవికి రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో వరి, మిరప సాగు చేస్తుంటారు.
ఇది కూడా చూడండి: ఘోర ప్రమాదం.. నలుగురు మృతి
చికిత్స తీసుకుంటూ..
పంటలు సరిగ్గా పండకపోవడం, లాభాలు రాకపోవడంతో బ్యాంకులో రూ.2.46 లక్షల పంట రుణం తీసుకున్నాడు. దీంతో పాటు బయట అప్పులు కూడా ఉన్నాయి. ఆర్థిక సమస్యలు, పంట రుణమాఫీ కాకపోవడంతో మనస్తాపం చెంది పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పొలానికి వెళ్లిన భర్త ఎంత సమయానికి ఇంటికి రాకపోయే సరికి భార్య వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రవి మరణించాడు.
ఇది కూడా చూడండి: Hyderabad Software : మియాపూర్ లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దారుణ హత్య!