/rtv/media/media_files/2025/07/19/ed-notices-2025-07-19-11-44-40.jpg)
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన కేసుల విచారణ ED వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే టెక్ దిగ్గజాలైన గూగుల్, మెటాకు దర్యాప్తు సంస్థ శనివారం నోటీసులు జారీ చేసింది. జులై 21న ఈ కంపెనీ ప్రతినిధులు విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది. ఇప్పటికే పలు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినందుకు కొందరు సెలబ్రెటీలపై కేసులు నమోదు చేశారు.
ED summons Google, Meta on July 21 in Betting App case
— ANI Digital (@ani_digital) July 19, 2025
Read @ANI Story l https://t.co/YsPy8YoF6M#ED#Google#Meta#BettingAppspic.twitter.com/n6dXcOKT3O
మనీలాండరింగ్, హవాలా లావాదేవీలు ఇతర ఆర్థిక నేరాలకు సంబంధించి దర్యాప్తులో ఉన్న బెట్టింగ్ యాప్‌లను ఈ 2 టెక్ దిగ్గజాలు ప్రమోట్ చేస్తున్నాయని ఈడీ ఆరోపించింది. ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించిన ప్రకటనలు, వెబ్‌సైట్‌లకు గూగుల్ తోపాటు మెటా ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.