Dharmasthala Mass Burial Case: 13 ఏళ్ల చిన్నారి అస్థి పంజరం.. లో దుస్తులు.. ధర్మస్థల కేసులో వెలుగులోకి మిస్టరీ విషయాలు!

కర్ణాటక ధర్మస్థల కేసులో మిస్టరీ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిట్ జరిపిన తవ్వకాల్లో ఓ 13 ఏళ్ల చిన్నారి అస్థి పంజరంతో పాటు మానవులకు సంబంధించిన 15 ఎముకలు, లో దుస్తులు లభ్యమైనట్లు సిట్ అధికారులు తెలిపారు. వీటిని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు.

New Update

కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మస్థల కేసులో తాజాగా మిస్టరీ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. గత కొన్నేళ్ల నుంచి ఈ ప్రాంతంలో పలువురు మహిళలు, బాలికలు అనుమానాస్పదంగా అదృశ్యమయ్యారని ఓ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో సిట్ విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే ధర్మస్థల ప్రాంతంలో తవ్వకాలు చేపట్టింది. 

ఇది కూడా చూడండి: Dharmasthala Mass Burial Case: 450 మంది మహిళలు అదృశ్యం.. లెక్కలేనన్నీ శవాలు.. ధర్మస్థల కేసులో వెలుగులోకి సంచలన విషయాలు!

ఎముకలు, లో దుస్తులు..

దర్యాప్తులో భాగంగా సిట్ మొదటి ఐదు ప్రాంతాల్లో తవ్వకాలు జరిపింది. కానీ ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఆ తర్వాత తవ్వకాలు జరపగా 13 ఏళ్ల చిన్నారి అస్థి పంజరంతో పాటు మానవులకు సంబంధించిన 15 ఎముకలు, లో దుస్తులు లభ్యమైనట్లు సిట్ అధికారులు తెలిపారు. ఇంకా ఎలాంటి పుర్రె లభ్యం కాలేదని, తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు లభ్యమైన ఆధారాలను అధికారులు ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు. నివేదిక వచ్చిన తర్వాత వీటి గురించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. 

వైద్య విద్యార్థిని తల్లి ఫిర్యాదు..
మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. కానీ గతంలో ఓ వైద్య విద్యార్థిని అనన్య భట్ ఈ ధర్మస్థల క్షేత్రంలో అనుమానాస్పదంగా మిస్ అయ్యింది. దీంతో ఆమె తల్లి సుజాత పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. కానీ పోలీసులు ఆమె కేసును తీసుకోలేదని తాజాగా తెరపైకి వచ్చింది. చెప్పుకుంటే ఎన్నో వందల కేసులు, ఎందరో మహిళలు, విద్యార్థినులు ఈ ప్రాంతంలో అదృశ్యమయ్యారని ఆరోపణలు ఉన్నాయి.

ముమ్మరంగా తవ్వకాలు
నేత్రావతి నది తీరాన ఎందరో మహిళల మృతదేహాలను పూడ్చి పెట్టారని ఫిర్యాదు వచ్చిన వెంటనే కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం నలుగు ఐఏఎస్ అధికారులు అధ్వర్యంలో ఈ బృందాన్ని ఏర్పాటు చేశారు. నిజం ఏంటనే విషయం తెలుసుకోవడం కోసం సిట్ ముమ్మరంగా తవ్వకాలు చేపట్టింది. పూర్తి వివరాలు తెలిసే వరకు ఈ దర్యాప్తు కొనసాగుతూనే ఉంటుందని సిట్ వెల్లడించింది. 

ఓ లేఖతో వెలుగులోకి..
ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఈ ధర్మస్థల ప్రాంతంలో పనిచేశారు. 1995-2014 వరకు ఈ ప్రాంతంలో తన చేతుల మీదుగానే ఎన్నో మృతదేహాలను రహస్యంగా పాతిపెట్టానని ఆ లేఖలో తెలిపారు. రహస్యంగానే ఈ మృతదేహాలను పాతిపెట్టాలని బలవంతం చేశారని పేర్కొన్నారు. 2012లో సౌజన్య అనే విద్యార్థిని ఈ ప్రాంతంలో దారుణంగా హత్య చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.. చివరకు నిర్దోషి అని కోర్టు తీర్పు ఇవ్వడంతో వదిలేసి కేసు క్లోజ్ చేశారు.

ఇది కూడా చూడండి: Dharmasthala case : ధర్మస్థల శవాల వెనుక అంతుచిక్కని మిస్టరీలు.. వెలుగులోకి సంచలన విషయాలు!

Advertisment
తాజా కథనాలు