Delhi: ఢిల్లీలో దుమారం రేపుతున్న మైనర్ బాలిక అత్యాచార ఘటన
ఢిల్లీలో ఓ మైనర్ బాలిక అత్యాచార ఘటన దుమారం రేపుతోంది. ఓ ప్రభుత్వ అధికారే నెలల తరబడి ఆమెపై పైశాచికంగా ప్రవర్తించడం సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతున్న ఆస్పత్రి దగ్గర ధర్నాకు దిగారు ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్.