Delhi Incident: భార్య వేధింపులు తట్టుకోలేక ప్రాణం తీసుకున్నాడు ఓ భర్త. విడాకులు తర్వాత కూడా భార్య ఆస్తి కోసం వేధించడంతో మానసికంగా కృంగిపోయి తనువు చాలించాడు. ఈ హృదయవిదారక ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. Also Read: RGV: వివాదాలకు పోను, అమ్మాయిల జోలికి అస్సలే పోను.. RGV న్యూ ఇయర్ ట్వీట్ ! చనిపోయే ముందు సెల్ఫీ వీడియో.. ఢిల్లీలోని ఉడ్‌బాక్స్ కేఫ్ ఓనర్ పునీత్ ఖురానాకు మాణిక జగదీశ్ పహ్వాతో అనే అమ్మాయితో పెళ్లయింది. అయితే కొన్ని మనస్పర్థలతో వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకున్నారు. అయితే వీరి విడాకుల కేసు విచారణ జరుగుతుండగానే పునీత్ సూసైడ్ చేసుకొని చనిపోవడం హాట్ టాపిక్ గా మారింది. ప్రాథమిక సమాచారం ప్రకారం భార్య మాణిక.. విడాకుల తీసుకున్న తర్వాత కూడా తనకు వ్యాపారంలో భాగం ఇవ్వాలని, తనకు రావాల్సిన మొత్తం చెల్లించాలని పునీత్ ని వేధింపులకు గురి చేసిందట. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన పునీత్ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పునీత్ చివరిగా తన భార్యతో మాట్లాడిన 6 నిమిషాల కాల్ రికార్డ్‌ను గుర్తించారు. మరి వైపు కుటుంబ సభ్యులు పునీత్ చనిపోయే ముందు వీడియో రికార్డింగ్ చేశాడని.. అది తమ వద్దే ఉందని చెబుతున్నారు. Also Read: Gandhi TathaChettu: థియేటర్స్ లో సుకుమార్ కూతురు అవార్డు విన్నింగ్ షార్ట్ ఫిల్మ్..!