building collapses: పాపం మొదటి పుట్టిన రోజే చివరి రోజు.. పాపని చూస్తే కన్నీళ్లు ఆగవు

పాపని చూస్తే ఎవ్వరైనా అయ్యో పాపం అనాల్సిందే. ఫస్ట్ బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న చిన్నారికి అదే చివరిగా మారింది. కేక్ కట్ చేసిన అంతలోనే వరదలు చిన్నారిని పొట్టన బెట్టుకున్నాయి. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఒక జంటకు పెను విషాదం ఎదురైంది.

New Update
building collapses

పాపని చూస్తే ఎవ్వరైనా అయ్యో పాపం అనాల్సిందే. ఫస్ట్ బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న చిన్నారికి అదే చివరిగా మారింది. కేక్ కట్ చేసిన అంతలోనే వరదలు చిన్నారిని పొట్టన బెట్టుకున్నాయి. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఒక జంటకు పెను విషాదం ఎదురైంది. తమ గారాల పట్టి మొదటి పుట్టినరోజు ఘనంగా జరుపుకున్న కొన్ని గంటల్లోనే, వారు నివసిస్తున్న భవనం కూలిపోయింది. దీంతో తల్లి, చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన పాల్ఘర్‌లోని వాసాయి-విరార్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

మంగళవారం రాత్రి ఓంకార్ జోయెల్, ఆరోహి జోయెల్‌లు తమ ఏడాది వయస్సున్న కూతురు ఆరాధ్య పుట్టినరోజు వేడుకను కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఆనందంగా కేక్ కట్ చేసి, సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత రాత్రి అందరూ నిద్రలోకి జారుకున్నారు. బుధవారం తెల్లవారుజామున రమాబాయి అపార్ట్‌మెంట్‌లోని నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది.

అర్థరాత్రి అంతా గాఢనిద్రలో ఉండగా ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉంది. భవనం కూలిపోయిన సమయంలో ఓంకార్, ఆరోహి, ఆరాధ్య శిథిలాల కింద చిక్కుకున్నారు. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆరోహి (24), ఆమె ఏడాది చిన్నారి ఆరాధ్య మృతదేహాలను వెలికితీశాయి. ఓంకార్‌ను మాత్రం తీవ్ర గాయాలతో బయటకు తీశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ బిల్డింగ్ అక్రమంగా నిర్మించబడిందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. భవన నిర్మాణదారుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ విషాద ఘటనలో మొత్తం 15 మంది మరణించగా, 18 మందికి పైగా గాయపడ్డారు. పుట్టినరోజు వేడుకల అనంతరం సంతోషంతో దిగిన ఫోటోలు, ఐదు నిమిషాలకే విషాదంగా మారిన ఘటన ఆ ప్రాంత ప్రజలను కంటతడి పెట్టించింది. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. భవన నిర్మాణ నిబంధనలు పాటించకుండా నిర్మించిన అక్రమ కట్టడాలే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisment
తాజా కథనాలు