/rtv/media/media_files/2025/08/10/lgbt-2025-08-10-13-18-17.jpg)
LGBT
ప్రస్తుతం డేటింగ్ యాప్‌లు ఎక్కువగా ఉంటున్నాయి. ఇందులో తెలియని వ్యక్తులతో డేటింగ్ చేస్తుంటారు. చివరకు ఇదే కొంపముంచుతుంది. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎల్‌జీబీటీ డేటింగ్ యాప్ ద్వారా హైదరాబాద్‌కు చెందిన ఓ 65 ఏళ్ల వ్యక్తి ఓ యువకుడితో మాట్లాడాడు. మొదట్లో చాటింగ్ చేసుకునే వారు. ఆ తర్వాత ఓ హోటల్‌లో ఇద్దరు కలిశారు. వీరిద్దరూ కలిసి నగ్నంగా ఉన్న సమయంలో మరో ఇద్దరు వ్యక్తులు వీరి ఫొటోలు తీసి బెదిరించారు. 65 ఏళ్ల వ్యక్తి నుంచి డబ్బులు వసూలు చేశారు. ఎన్ని సార్లు ఇచ్చినా మళ్లీ అడగడంతో ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
ఇది కూడా చూడండి: Palnadu Ragging: పల్నాడు లో ర్యాగింగ్ కలకలం.. కర్రలతో కొడుతూ.. కరెంట్ షాక్ పెడుతూ! వీడియో వైరల్
ధనవంతులను టార్గెట్ చేసి..
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి. ఇలాంటి డేటింగ్ యాప్‌లో కలిసి మోసం చేస్తున్నారు. ఎక్కువగా స్వలింగసంపర్కుల మధ్య ఇలాంటివి జరుగుతున్నాయి. సాధారణంగా ఈ ఎల్‌జీబీటీ యాప్స్‌లో లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్స్ ఉంటారు. ఇందులో ఎవరైతే ధనికులు ఉంటారో వారినే టార్గెట్ చేసి మోసం చేస్తున్నారు. వీరికి ఈ యాప్స్ ద్వారా దగ్గర అయ్యి ముగ్గులోకి దించుతున్నారు. ఆ తర్వాత వారిని హోటల్స్, ఫామ్ హౌస్‌లకు పిలిచి మత్తులోకి దించి నగ్న ఫొటోలు తీస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌కి చెందిన మరో డాక్టర్‌కు కూడా ఇలానే జరిగింది. ఒక యాప్‌లో పరిచయమైన వ్యక్తితో చాటింగ్ చేశాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి పిలవగానే ఒక ఫామ్‌హౌస్‌కు వెళ్లాడు. అక్కడ ఇద్దరూ మద్యం తాగారు.
ఇది కూడా చూడండి:Shrishti Fertility Center: సృష్టి కేసులో ఈడీ రంగ ప్రవేశం.. భారీగా నిధులు తరలింపుపై అనుమానాలు
మద్యం మత్తులో ఉన్నప్పుడు, ఆ వ్యక్తి డాక్టర్ నగ్న ఫోటోలు తీశాడు. ఈ విషయం తెలియని డాక్టర్ అక్కడి నుంచి తిరిగి వచ్చాడు. కానీ కొన్ని రోజుల తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు డాక్టర్ నగ్న ఫోటోలను వాట్సాప్‌లో పంపి, బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టారు. భయపడిన డాక్టర్ మోసగాళ్లు అడిగిన డబ్బులు ఇచ్చారు. ఇలాంటి కేసులు ఎక్కువగా రావడంతో పోలీసులు వీరిపై నిఘా పెట్టారు. డేటింగ్స్, ట్రాన్స్ వారిని గుర్తిస్తున్నారు. మోసం చేసేవారు ముందుగా ఎల్‌జీబీటీ యాప్స్‌లో సభ్యత్వం తీసుకుంటారు. ఆ తర్వాత పలుకుబడి, డబ్బులు ఉన్న వారిని టార్గెట్ చేస్తారు. వారితో ప్రేమగా మాట్లాడి, స్నేహం చేసి మెల్లిగా తమ ఉచ్చులోకి లాగుతారు. ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియా ఎక్కువ కావడంతో ఇలాంటి ఘటనలు జరగుతున్నాయి. తెలియని వ్యక్తులను కలిసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మత్తులోకి ఎక్కించి ఆ తర్వాత చీట్ చేస్తున్నారని తెలిపారు.