ఆరుగురు వేటకొడవళ్లతో దాడి.. అనంతపురంలో రచ్చ రచ్చ

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బోడాయిపల్లి గ్రామంలో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో వ్యక్తిపై వేట కొడవళ్లతో దాడి చేశారు. నడిపి కుల్లాయప్ప వరి పొలంలో ఒకేసారి ఆరుగురు దాడికి దిగారు. దీంతో ఘర్షణలో ఐదుగురి తీవ్రగాయల పాలైయ్యారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

New Update
tadipatri

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో శుక్రవారం రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. బోడాయిపల్లి గ్రామంలో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో వ్యక్తిపై వేట కొడవళ్లతో దాడి చేశారు. నడిపి కుల్లాయప్ప వరి పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటుండగా ఒకేసారి 6 మంది దాడికి దిగారు. కుల్లాయప్ప తరపు కూడా మరి కొందరు ఎదురుదాడికి వచ్చారు. దీంతో ఘర్షణలో ఐదుగురి తీవ్రగాయల పాలైయ్యారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisment
తాజా కథనాలు