Crime News: వివాహ వేడుకలో విషాదం.. బంధువులపై దూసుకెళ్లిన పెళ్లి కారు.. నలుగురు స్పాట్ డెడ్!

బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బెట్టియా జిల్లాలో లౌరియా-బాగా రహదారిపై పెళ్లికి వచ్చిన బంధువులపై కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాద ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.

New Update
Accident

Accident

బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బెట్టియా జిల్లాలో లౌరియా-బాగా రహదారిపై పెళ్లికి వచ్చిన బంధువులపై కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాద ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే పెళ్లికి వెళ్లిన బంధువులు తిరిగి వస్తుండగా రోడ్డు పక్కన నిల్చుని ఉన్నారు.  ఆ సమయంలో అతి వేగంతో వచ్చిన కారు అదుపుతప్పి వారికి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్‌లోనే మృతి చెందారు. గాయపడిన మిగతా 16 మందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 42 మంది మృతి.. హైదరాబాద్ వాసులే ఎక్కువ!

ఇది కూడా చూడండి: Gen Z protest : మెక్సికోలో హింసాత్మకంగా మారిన జెన్‌ జెడ్ నిరసన....100 మందికి పైగా..

Advertisment
తాజా కథనాలు